RK Roja : ఈ సారి ఏపీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా మారాయో మనం చూశాం. చాలా టఫ్‌గా ఫలితాలు ఉంటాయని అందరు అనుకున్నారు. కాని ఎవరు ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు వన్ సైడ్ అయ్యాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేశారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. వైసీపీ మంత్రులు పోటీ చేస్తోన్న నియోజకవర్గాల్లో.. ఆ పార్టీకి పరాభవం ఎదురైంది. పెద్దిరెడ్డి మినహా అందరు మంత్రులు ఓటమి పాలయ్యారు. ఇక నగరిలో మంత్రి ఆర్‌కే రోజా తన సమీప టీడీపీ అభ్యర్ధి గాలి భానుప్రకాశ్‌పై 43,505 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ తరుణంలో రోజా తన ఓటమిని అంగీకరిస్తూ.. ఎక్స్ వేదికగా ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు.
చిరునవ్వులు చిందిస్తున్న తన ఫోటోను పంచుకుంటూ.. ‘భయాన్ని విశ్వాసంగా… ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారతారు’ అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే ఎవరైతే పవన్ కళ్యాణ్‌పై తప్పుడుగా ప్రచారం చేశరో వారు ఎన్నికలలో దారుణాతి దారుణంగా ఓడిపోయారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకపోయినా.. రాష్ట్రానికి అదేదో ఆపద వచ్చిపడినట్టు, రాష్ట్రాభివృద్ధి ఆగిపోయినట్టు పవన్ మూడు పెళ్లిళ్ల గురించి పదే పదే మాట్లాడుతుంటారు. చివరికి సీఎం జగన్‌మోహన్ రెడ్డి సైతం ఎన్నోసార్లు పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారు.
‘కార్లను మార్చినట్లు పవన్ భార్యలను మారుస్తాడని’ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యారేజీ స్టార్ ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తాడని పేర్కొన్నారు. ఇక అంబటి రాయుడు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజాతో పాటు కొందరు పవన్‌పై తీవ్ర విమర్శలు చేయగా అందుకు మూల్యం చెల్లించుకున్నారు. వీరంతా కూడా ఈ సారి ఏపీ ఎన్నికలలో ఘోర పరాజయం చెందారు. ఇక పవన్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు సన్నద్ధమవుతున్నారు.