Revanth Reddy : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా.. అందులో టీపీసీసీ రేవంత్ రెడ్డి పాత్ర కీలకంగా చెప్పవచ్చు. అయితే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటు తెలంగాణలోనే కాకుండా.. రేవంత్‌కు ఏపీలో కూడా అభిమానులు ఉన్నారు. ఆయన టీడీపీతో కలిసి పని చేయటంతో పాటు, రేవంత్ అల్లుడిది కూడా ఏపీనే కావటంతో.. అభిమానం వెల్లువెత్తుతోంది. ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ.. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.మరోవైపు కాంగ్రెస్ గెలిచిందనే విషయం బయటకు రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు బైబై కేసీఆర్ అంటూ నినాదాలు కూడా చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా భావిస్తున్న సమయంలో పదేపదే రేవంత్ ను కాంగ్రెస్ ను కెసిఆర్ కేటీఆర్ లు టార్గెట్ చేసుకోవడం పెద్ద ఎత్తున విమర్శలు చేయడం ఇవన్నీ రేవంత్ కు కాంగ్రెస్ కు బాగా కలిసి వచ్చాయి.రేవంత్ ప్రతి విషయంలోనూ కేసీఆర్ ను ఇరుక్కుని పెట్టేలా విమర్శలు చేయడం దానికి కౌంటర్ గా ప్రతి విమర్శలు చేయడంతో పాటు రేవంత్ పై కేసులు నమోదు చేయడం వంటివన్నీ రేవంత్ కు ప్రజలలో సానుభూతి పెరిగేలా చేసింది.అంతేకాకుండా బీఆర్ఎస్ ను ఎదుర్కొని ఆ పార్టీని ఓడించగల సత్తా రేవంత్ కు మాత్రమే ఉందని కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్తించేలా పరోక్షంగా కేసీఆర్ చేశారు.రేవంత్ ను రాజకీయంగా అనిచివేయలి అనే ధోరణితో ఉంటూ కేసీఆర్ రావడం రేవంత్ గ్రాఫ్ పెరిగేలా చేసింది అనడం లో సందేహం లేదు.
గెలుపు తర్వాత రేవంత్ రెడ్డి చాలా హుందాగా మాట్లాడారు. కేటీఆర్ మమ్మల్ని అభినందించారు. వారిని స్వాగతిస్తున్నా.ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతిపక్షాలు అందరు సపోర్ట్ చేయాలని, గెలిచిన పార్టీలే కాదు నాయకత్వం వహిస్తున్న పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే కార్యక్రమాలకి ఆహ్వానం పలుకుతాము అని అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పార హక్కులని నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది. ప్రజలకి ఇచ్చిన ఆరు హక్కులని, రాహుల్ గాంధీ చెప్పిన మాటలని నిలబెడతాం అని కూడా రేవంత్ చెప్పుకొచ్చారు. ప్రజల ఆదేశాన్ని సందేశంగా తీసుకొని అన్ని పార్టీలు సహకారం అందించాలని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుందని రేవంత్ అన్నారు.