Revanth Reddy : తెలంగాణ ఎన్నికలకి ఎంతో సమయం లేదు. దీంతో ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఎవరికి తగ్గట్టు వారి మ్యానిఫెస్టో ఇస్తున్నారు. అయితే తాము అధికారంలోకి వస్తే గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు (గృహజ్యోతి) ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఉచిత విద్యుత్తు కావాలంటే ఇంట్లో ఒక్కటే కరెంటు బుగ్గ ఉండాలని, ఒక్కటే ఫ్యాన్ ఉండాలని, ఒక్కటే టీవీ ఉండాలని కాంగ్రెస్ నేత ఒకరన్నారు. కర్ణాటకలో ఇలాంటి ప్రచరాలే చేసి వారు నరకం అనుభవించేలా చేస్తున్నారు. ఇక్కడ మాత్రం వారిని ఎవరు నమ్మేలా లేరని యాంటీ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఇంటిలో అయినా ఒకటే బల్బు, ఒకటే ఫ్యాన్ ఉండటం అసాధ్యం. సింగిల్ బెడ్‌రూం ఇంట్లో అయినా కనీసం మూడు లైట్లు ఉంటాయి. రెండు ఫ్యాన్లు ఉంటాయి. ఇక టీవీ, ఫ్రిజ్ కూడా సాధారణమే. ఇవి లేని కుటుంబాలు ఒకటిరెండు శాతం కూడా ఉండవు. ఈ లెక్కన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్న గృహజ్యోతి పథకం ఏ ఇంటికీ వర్తించదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 200 యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్తూ.. ఇలా కండిషన్లు పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీది పచ్చి మోసం అని ప్రజలు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ వాళ్లు 3 గంటల కరెంట్ ఇస్తామని, 10 హెచ్ పీ మోటార్స్ పెట్టుకోవాలని అంటున్నారు. కాని అదెలా సాధ్యం. ఇప్పుడు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారు. 5 హెచ్‌పీ మోటర్లు పెట్టుకొని, మంచిగా పంటలు పండించుకుంటున్నాం. అట్లకాదని 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకొని, 3 గంటల కరెంట్‌తో పంటలు పండించుకోలేం. 10 హెచ్‌పీ మోటర్‌తో ట్రాన్స్‌ఫారంపై లోడ్ పడుతుంది. స్టార్టర్లు, మోటార్లు కాలిపోతాయి. దానికి పెద్ద రూటర్, పెద్ద షాఫ్ట్ ఉంటుంది. ఏదన్నా ప్రాబ్లం వచ్చి బయటకు తీయాలంటే కూడా ఇబ్బందే. 3 గంటల కరెంట్, 10 హెచ్‌పీ మోటార్లతో వ్యవసాయం జరుగదు. ఇచ్చినా మాకు వద్దు. ఇది రైతులకే కాదు ప్రభుత్వానికీ భారమే.