Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఉండడం వలన అనేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అపోజీషన్ పార్టీస్ పవన్‌పై తెగ ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయాల పరంగానే కాకుండా పవన్ పర్సనల్ విషయాలపై కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలను విమర్శించే క్రమంలో సహనం కోల్పోయిన పవన్.. మాటల్లో మాటగా విడాకులు ఇచ్చిన ఇద్దరు భార్యలకు ఎంతెంత భరణం ఇచ్చాడో చెప్పుకొచ్చాడు. వైసీపీ వాళ్లు ప్రతీసారి తన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతుంటారని.. మీక్కూడా చేసుకోవాలని ఉంటే.. చేసుకోండని చురకలంటించాడు.
ఒక పెళ్లి చేసుకుని ముప్పై స్టెప్నీలను మెయింటైన్ చేసే మీరా? నన్ను అనేది అంటూ విరుచుకుపడ్డ తాను మొదటి భార్యకు ఐదు కోట్లు ఇచ్చాను.. విడాకులు తీసుకున్నాను.. రెండో భార్యకు నా ఆస్థి ఇచ్చాను.. మూడో పెళ్లి చేసుకున్నాను.. అని అన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మరో మలుపు తిరిగాయి. తాను భరణంగా ఏమీ తీసుకోలేదని నాడు రేణూ దేశాయ్ చెప్పగా, ఇప్పుడు ఈ విషయం వైరల్ అయింది. ఆ మధ్య ఒకసారి రేణూ దేశాయ్, తన పిల్లల కోసం పవన్ కళ్యాణ్ ఓ లగ్జరీ ఇళ్లు కొనిచ్చాడనే వార్తలు వచ్చాయి. దీనిపై రేణూ దేశాయ్ బాధపడింది. అది పవన్ కళ్యాణ్ కొనివ్వలేదని, తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బులతోనే కొనుక్కున్నాను అంటూ చెప్పుకొచ్చింది.
![Renu Desai : తన ఆస్తి రేణూకి ఇచ్చానన్న పవన్.. చిల్లి గవ్వ తీసుకోలేదన్న రేణూ.. సంచలన విషయాలు బయటకు.. Renu Desai said she did not take assets from pawan kalyan](http://3.0.182.119/wp-content/uploads/2022/10/renu-desai.jpg)
మరి రేణూ దేశాయ్ అలా చెప్పగా, ఇప్పుడు పవన్ ఇలా చెప్పాడేంటి.. ఇద్దరిలో ఏది నిజం అనే విషయంపై తెగ చర్చలు నడుస్తున్నాయి. కాగా, పవన్ కళ్యాణ్ 1997లో వైజాగ్ కి చెందిన నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. 2007లో అధికారికంగా విడాకులు ఇచ్చి విడిపోయారు. అనంతరం 2009లో రేణూ దేశాయ్ ని వివాహం చేసుకున్నారు. 2012లో రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చారు. రేణు దేశాయ్ కి ఒక అబ్బాయి, అమ్మాయి సంతానంగా ఉన్నారు. 2013లో అన్నా లెజినోవా మెడలో తాళికట్టాడు. ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు.