Rayapati Aruna : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చాలా వాడి వేడిగా సాగుతున్నాయి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తుండడంతో రాజకీయం మరింత వేడెక్కుతుంది. ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఏపీలో మహిళల మిస్సింగ్, వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఏలూరులో మహిళల మిస్సింగ్‌పై పవన్ చేసిన ఆరోపణలపై ఆధారాలివ్వాలని స్పష్టం చేసింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మహిళల భద్రతకు భంగం కలిగేలా ఉన్నాయని పద్మ అన్నారు.
వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని , డైలాగ్స్ కొట్టి వెళ్లడం ఆయనకు అలవాటుగా మారిందని పద్మ విమర్శించారు. రాజకీయాల కోసం పవన్ దిగజారుతున్నారని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సీటు కోసం ఎవరినైనా ఫణంగా పెడతారా , మహిళల మిస్సింగ్ గురించి ఆయనకు ఏ అధికారి చెప్పారో తమకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులు లేవా? అని ఆమె నిలదీసింది. అయితే పద్మ వ్యాఖ్యలపై జనసేన నాయకురాలు అరుణ తీవ్రంగా స్పందించింది.ఏపీలో విచారణ ఎలా జరుగుతుందో అందరికి తెలుసు. వాలంటీర్స్ అందరు నేరస్తులని మేము అనలేదు.
వాలంటీర్స్ ఇచ్చిన సమాచారం వలన అన్యాయం జరుగుతుందని పవన్ అన్నారు. దీనిపై పద్మ నోటీలసు పంపడం ఆశ్చర్యంగా ఉంది. నిజాలని నిగ్గు తేల్చాలంటూ పోలీస్ కి డిపార్ట్‌మెంట్‌క సర్వ్ చేయాలి కాని, పవన్ కళ్యాణ్‌కి చేయడమేంటని అరుణ అన్నారు. మహిళలు మిస్ అవుతున్నారని చెబుతుంటే, ఆ మిస్ అయింది ఎవరు, ఎలా మిస్ అవుతున్నారనేది ఆలోచించకుండా ప్రశ్నించిన వారికి నోటీసులు పంపుతారా. ఎంత బానిసత్వం అనేది ఇక్కడ అర్ధమవుతుంది అని అరణ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా కమీషన్ లేదా వైసీపీ వాలంటీరా అనేది మాకు అర్ధం కావడం లేదు అంటూ అరుణ అన్నారు.