Rayapati Aruna : ఏపీ రాజకీయం ఎంత రంజుగా మారుతుందో మనం చూస్తూనే ఉన్నాం. నేతలు ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటూ రాజకీయాలు వేడెక్కేలా చేస్తున్నారు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా దారుణమైన కామెంట్స్ చేసింది. రుషికొండపై సిఎం జగన్ ఇల్లు కట్టుకుంటున్నాడని పవన్ కళ్యాణ్ విమర్శలు చేయగా, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గెలువలేదు…ఉన్న ఒక్క ఎమ్మెల్యే లేడు.. నువ్వు ప్రతి పక్షనేత అని ఎలా చెప్పుకుంటావ్ అంటూ నిప్పులు చెరిగారు రోజా. బాలకృష్ణ అల్లుడు గీతం యూనివర్సిటీ సంబంధించి కబ్జా చేసిన నలబై ఎకరాలు ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది… దీనిపై పవన్ కు దమ్ముంటే మాట్లాడాలని సవాల్ విసిరారు మంత్రి రోజా.
పవన్ కళ్యాణ్ తన కళ్ళను కల్యాణ్ జ్యూలరీలో తాకట్టుపెట్టాడు ఏమో…? అంటూ చురకలు అంటించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇండ్లు బంజారాహిల్స్ కొండపైనే ఉన్నాయన్నారు.కొండలపై ఎన్నో కట్టడాలు చాలా చోట్ల ఉన్నాయి.. తిరుమల, సింహాచలంలోను రోడ్డు బిల్డింగ్ లు అభివృద్ధి చేశారని పేర్కొన్నారు మంత్రి రోజా. ఇవన్నీ పవన్ కళ్యాణ్ కు కనపడటం లేదా..? అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఏమైనా హెరిటెజ్ ఐస్ క్రీం నోట్లో పెట్టుకొని ఉన్నాడా ? అని విమర్శించారు రోజా. రిషికొండ బోడిగుండు కొట్టించారంటూ బోడి ఎదవలందరూ బోడి ప్రచారం చేస్తున్నారు…రిషికొండపై నిర్మాణాలకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది… కోర్టు కంటే పవన్ కల్యాణ్ గొప్పోడా, నువ్వు ఎవడ్రా అంటూ విమర్శలు గుప్పించింది రోజా.
దీనిపై జనసేన నాయకురాలు రాయపాటి అరుణ స్పందిస్తూ… ఎమ్మెల్యే అయినప్పుడు రోజా తెగ షోలలో కనిపిస్తుంది. మంత్రి అయిన సందడి చేస్తుంది.ఆమె మాట్లాడే మాటలు దారుణంగా ఉన్నాయి. వైజాగ్‌లో సముద్రం ఉంది కాబట్టి రిషికొండ ప్రకృతి వైపరీత్యాలని తట్టుకుంటుంది. అయితే శ్రీశైలం, సింహాచలం, తిరుపతి మీద కట్టడాలు ఉన్నాయి. అక్కడ ఎందుకు ప్రశ్నించలేదు అని ఆమె అంటుంది. అసలు సముద్రం నుండి వచ్చే ప్రకృతి విపత్తులకి అడ్డంగా రిషికొండ ఉంది, దానిని నాశనం చేయోద్దు అంటూ వేరే ప్లేస్‌లు చెబుతుంది. అక్కడ సముద్రం ఉందా.. రిషికొండ మీద ఆమె జగన్ స్వామిని పెడుతుందా. పవన్ కళ్యాణ్‌ని ఎవడ్రా అంటుందా.. ఆమె ప్రజా ప్రతినిదా, మాలాంటి వాళ్లని చూసి ఏమి నేర్చుకోవాలి, ఆమెకి సరైన అవగాహన లేదు, ఆమె గురించి మాట్లాడాలి అంటే చిరాకుగా ఉంది అని అరుణ పైర్ అయింది.