Rayapati Aruna : ప్రస్తుతం ఏపీ రాజకీయం చాలా వేడెక్కుతుంది. పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన పేర్ని నాని.. ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నువ్వు ఒక్క చెప్పు చూపిస్తే కూడా వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ గత వీడియోలను ప్లే చేసిన పేర్ని నానీ.. వాటిలో ఆయన మాట్లాడిన మాటలకూ… నిన్న చేసిన ప్రసంగానికీ పోలిక చూపిస్తూ… మాటల్లో ఎంత తేడా ఉందో గుర్తించాలని కోరారు. ప్రజలని తప్పుడు దారిలో పయనించేందుకే పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేసారని నాని అన్నారు.
అయితే నాని వ్యాఖ్యలకు జనసేన అధికార ప్రతినిథి రాయపాటి అరుణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కాబట్టి ఒక చెప్పు చూపించాడు. నేను అయితే చెప్పుతోనే కొడతానని ఆమె పేర్కొంది.పవన్ కళ్యాణ్ గారు చాలా మర్యాదస్తుడు కాబట్టి అలా చెప్పు చూపించి వదిలేశాడు. పవన్ కళ్యాణ్ వక్తిగత జీవితంపై వారు ఎంత దారుణమైన వ్యాఖ్యలు వారు చేశారు. వీరి బ్రతుక్కి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఉందా అని ఆమె ప్రశ్నించారు. వాళ్లు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ సొల్లు చెబుతున్నారని వారు అనడం ఎంత వరకు కరెక్ట్.
![Rayapati Aruna : పవన్ కళ్యాణ్ చెప్పు చూపించి వదిలేశారు.. నేను చెప్పుతో కొట్టి ఉండేదాన్ని అన్న అరుణ.. Rayapati Aruna comments on perni nani](http://3.0.182.119/wp-content/uploads/2023/06/rayapati-aruna.jpg)
టీడీపీతో పొత్తు గురించి రాయపాటి స్పందిస్తూ.. యాత్ర ఇప్పుడే మొదలైంది. ప్రజా ప్రతినిథిగా ఆయన ప్రజలకి సేవ చేయాలని ఎంతో అనుకుంటున్నారు. ఎవరు ముఖ్యమంత్రి పొత్తులు ఎవరితో అనేవి రానున్న రోజులలో తెలియనుంది అని అరుణ అన్నారు. ఇప్పుడు ఏమి చెప్పలేమని చెప్పిన ఆమె, ఇప్పుడే జనాలలోకి ఆయన వెళుతున్నారు కాబట్టి ఎవరికి ఎన్ని సీట్స్ వస్తాయనేది త్వరలోనే అర్ధమవుతుందని అరుణ అన్నారు.