Rayapati Aruna : ప్రస్తుతం ఏపీలో రాజకీయం మరింత వేడెక్కుతుంది. ఒకరిపై ఒకరు దారుణమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. సచివాలయం తాకట్టుపెట్టారంటూ ఓ గగ్గోలు పెడుతున్నారన్న కొడాలి నాని.. ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం డబ్బులు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టడం మామూలేనన్నారు. ఆ తర్వాత డబ్బులు చెల్లించి విడుదల చేయించుకుంటుందని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
తాకట్టు పెట్టకుండా బ్యాంకులు లోన్లు ఇస్తాయా అని ప్రశ్నించిన కొడాలి నాని.. ఫలానావి మాత్రమే తాకట్టుపెట్టాలంటూ రాజ్యాంగంలో ఏమైనా రాసుందా అంటూ ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైనప్పుడు.. ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలే అన్నారు. సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమే.. ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలో అనే విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా..? అంటూ విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా..? అంటూ ప్రశ్నించారు. ప్రజల అవసరాల కోసం.. ప్రభుత్వ వేసులుబాటును బట్టే ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుందన్నారు. చిల్లర రాజకీయ నాయకుడు అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు చేస్తేనే సంసారం.. మిగతా వాళ్లు చేస్తే కాదన్నట్టుగా ఆయన వ్యవహారం ఉంటుందంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని. అయితే కొడాలి నాని వ్యాఖ్యలపై రాయపాటి అరుణ ఫైర్ అయింది. ప్రజల ఖాతాల్లో ఉన్న డబ్బులని జగన్ వాడేసుకున్నాడు. అందరి దగ్గర ఖాతాలు ఖాళీ చేయడమే ప్రభుత్వం సాధించింది. మన ఇళ్లు , మన పొలం, మన ఆస్తి కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొస్తాడు జగన్. రేపు వైసీపీకి ఓటేస్తే మనల్ని నిలువున దోచేస్తారు. నిసిగ్గుగా ప్రజల ఆస్తులని అమ్మేస్తున్నారు. ఎవడి డబ్బులతో స్టిక్కర్స్, పోస్టర్స్ ఎవరి డబ్బులతో వేసావంటూ రాయపాటి అరుణ ఫైర్ అయింది. రానున్న రోజులలో ఏమి తాకట్టు పెట్టి ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నారు. అప్పులు చేసే వాడిని దదమ్మ అంటారు. జగన్ దద్దమ్మ మనకు అవసరమా. అప్పుల ముఖ్యమంత్రికి అధికారం నుండి దింపకపోతే మనకి కూడా రేట్లు కడతాడు అని అరుణ అంది.