Raw Coconut Laddu : మనం అప్పుడప్పుడూ పచ్చి కొబ్బరిని కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. దీంతో మనం ఎక్కువగా పచ్చడిని తయారు చేస్తూ ఉంటాం. చాలా మంది పచ్చి కొబ్బరిని నేరుగా తింటూ ఉంటారు. దీనిని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. తరచూ పచ్చి కొబ్బరిని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి ని మెరుగుపరచడంలో, జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా పచ్చి కొబ్బరి ఉపయోగపడుతుంది.
చాలా మంది పచ్చి కొబ్బరిలో బెల్లాన్ని కలిపి లడ్డూలను కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ లడ్డూలను మరింత రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా వీటిలో డ్రై ఫ్రూట్స్ ను వేసి కూడా చేసుకోవచ్చు. రుచిగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రైఫ్రూట్ కొబ్బరి లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి తురుము – మూడు కప్పులు, పంచదార – ఒక కప్పు, బెల్లం తురుము – రెండు కప్పులు, బాదం పప్పు – పావు కప్పు, జీడిపప్పు – పావు కప్పు, పిస్తా పప్పు – పావు కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – చిటికెడు.
డ్రైఫ్రూట్ కొబ్బరి లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో డ్రైఫ్రూట్స్ ను వేసి దోరగా వేయించి చల్లగా అయిన తరువాత జార్ లో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అదే కళాయిలో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తరువాత కొబ్బరి తురుమును, బెల్లం తురుమును, పంచదారను వేసి మధ్యస్థ మంటపై 10 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. తరువాత యాలకుల పొడి, ఉప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న డ్రైఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసి బాగా కలిపి దగ్గర పడే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం గోరు వెచ్చగా ఉన్నప్పుడే మనకు కావల్సిన పరిమాణంలో లడ్డూలుగా చేసుకోవాలి. వీటిని మూత ఉండే డబ్బాలో నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. రోజుకి ఒకటి లేదా రెండు చొప్పున వీటిని తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ అందుతాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…