Raviteja Dhamaka Movie : ఈ మిస్టేక్ ని రవితేజ చూడలేదా.. తెగ ట్రోల్ అవుతున్న ధమాకా సాంగ్..!

Raviteja Dhamaka Movie : రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ధమాకా. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పెళ్లి సందD ఫేం శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకోగా.. తాజాగా సినిమాలోని వాట్స్ హ్యాపెనింగ్ అంటూ సాగే మూడో లిరికల్ సాంగును మేకర్స్ రిలీజ్ చేశారు. సింగిల్ గానే ఉంటా ఏ లవ్ లో పడకుండా అని అనుకున్న మాట ఏమయ్యిందో అంటూ ఈ సాంగ్ సాగుతుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను రమ్య బెహ్రా – భార్గవి పిళ్లై ఆలపించారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీని అందించాడు.

ప్రమోషన్ వీడియోలు బయటకు రిలీజ్ చేసేటప్పుడు దర్శక, నిర్మాతలు మాగ్జిమం జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఒక్కోసారి మిస్ ఫైర్ అవుతూంటాయి. ఈ సాంగ్ లిరికల్ వీడియోలో.. ఓ చోట.. అని నాన్న అన్నా అంటూ వస్తుంది. అప్పుడు రవితేజ ఫేస్ ప్లాష్ అవుతుంది. ఇది చూసిన వాళ్లు సోషల్ మీడియాలో ఫన్ చేస్తున్నారు. శ్రీలీల వయస్సు అమ్మాయికి తండ్రి వయస్సు రవితేజది అంటూ ట్రోల్ చేస్తున్నారు. రవితేజకు, శ్రీలీలకు ఉన్న ఏజ్ గ్యాప్ ని ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.

Raviteja Dhamaka Movie what is happening movie troll
Raviteja Dhamaka Movie

ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. డిసెంబర్ 23 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రాక్ తరువాత అంతటి విజయాన్ని అందుకోని మాస్ మహారాజా ఈ సినిమాతోనైనా హిట్ కొడతాడేమో చూడాలి.

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago