రవిచంద్రన్ అశ్విన్.. ఒకప్పుడు టీమిండియాకి కీలక బౌలర్‌గా ఉండేవాడు. అయితే ఇటీవల అతని జోరు తగ్గింది. జడేజాకి గాయం కారణంగా ప్రస్తుతం టీ 20 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం అందిపుచ్చుకున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగిన సంగతి తెలిసిందే. చివరి బంతికి రెండు పరుగులు చేస్తే టీమిండియా విజయం సాధిస్తుందనే స్థితిలో బ్యాటింగ్‌కు దిగిన అశ్విన్.. అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. లైగ్ సైడ్ దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి రిస్క్ తీసుకోకుండా.. ప్రశాంతంగా వికెట్ల ముందుకు జరిగి నిలబడ్డాడు. దీంతో అంపైర్ వైడ్ ఇవ్వగా.. తర్వాతి బంతిని మిడ్ ఆఫ్ మీదుగా తరలించిన అశ్విన్ సింగిల్ తీసి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ తర్వాత అశ్విన్ పేరు బాగానే మారు మ్రోగింది.
టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు బంతితో పెద్దగా రాణించింది లేదు. బ్యాటుతో కొన్ని విలువైన పరుగులు చేసిన అశ్విన్.. తన ప్రధాన బలమైన స్పిన్‌తో పెద్దగా ఆకట్టుకోలేదు.అశ్విన్ రాణించాల్సిన సమయం వచ్చింది. సెమీస్‌లో తప్పక వికెట్స్ తీయాలి. లేదంటే రానున్న రోజులలో అతని స్థానంపై నీలి నీడలు ఏర్పడడం ఖాయం. అయితే తాజాగా అశ్విన్‌కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భాగంగా ఆదివారం భారత్, జింబాబ్వేల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు టాస్ వేస్తుండగా.. అప్పటివరకూ ప్రాక్టీస్‌లో ఉన్న కొందరు ప్లేయర్స్ మైదానం వీడుతున్నారు.
ఈ క్రమంలో భారత సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ కూడా మైదానం వీడేందుకు సిద్దమయ్యాడు. గ్రౌండ్‌లో ఉన్న తన జెర్సీని గుర్తుపట్టేందుకు.. చేతిలో ఉన్న రెండు జెర్సీల వాసన చూశాడు. ఆపై తన జెర్సీని గుర్తుపట్టి.. ఇంకోదాన్ని అక్కడే పడేసి వెళ్లాడు. రవిచంద్రన్ అశ్విన్ జెర్సీల వాసన చూస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది పగలపడి నవ్వుకుంటున్నారు. అభినవ్ ముకుంద్, హర్భజన్ సింగ్ కూడా ఈ వీడియోపై ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన అశ్విన్.. ‘ముందుగా సైజు కోసం చెక్ చేశా. దానిపైన ఏమైనా పేర్లు ఉన్నాయేమో అని చూశా. చివరకు నేను వాడే పెర్‌ఫ్యూమ్ వాసన కూడా పరీక్షించి తీసుకున్నా’ అని బదులిచ్చాడు.
How boys Identify their Jackets😆😆😆😆#TeamIndia #RohitSharma #ashwin pic.twitter.com/8efWi9hbUe
— गब्बर सिंह (@Gabbar_singh29) November 8, 2022