Ravi Kishan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ చిత్రంలో విలన్‌గా నటించిన రవి కిషన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మనోడు భోజ్‌పురిలో స్టార్ యాక్టర్ కాగా, ఆయన గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ తరపున ఎంపీగా కూడా గెలిచారు. పలు హిందీ సినిమాల్లోనూ పనిచేసిన రవి కిషన్.. తెలుగులో దాదాపు పదికి పైగా సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేసి ప్రేక్షకుల మనసులని గెలుచుకునన్నారు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు జంటగా నటించి గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నగ్మాతో మనోడు ఎఫైర్ నడిపారనే రూమర్స్ ఉన్నాయి. వీరిద్దరూ భోజ్‌పురిలో అనేక చిత్రాల్లో జంటగా నటించడంతో ఈ రూమర్స్ బయటకు వచ్చాయి. కాని వాటిని ఖండించాడు.
రవి కిషన్.. మహేష్ బాబుతో ‘ఆగడు’, రవితేజతో ‘కిక్2’, రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ తదితర చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలోనే తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ఇక రీసెంట్‌గా ఆయన కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసి ఆశ్చర్యపరిచారు. సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఓ మహిళ నా వద్దకు వచ్చి ‘ఈ రాత్రి మనం కాఫీకి వెళ్దాం’ అని అడిగింది. నాకెందుకో అనుమానం వచ్చి.. సున్నితంగా తిరస్కరించా.. ఆమె ప్రవర్తనపై మొదటి నుండి నాకు కాస్త అనుమానంగానే ఉండింది అని రవి కిషన్ తెలిపారు. అయితే ఆమె ఎవరన్న విషయంపై క్లారిటీ ఇవ్వని ఆయన.. ప్రస్తుతం ఆమెకు సోసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని స్పష్టం చేశాడు. దీంతో ఆమె ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
1969లో జూలై 17న ఉత్తర ప్రదేశ్ లోని జౌన్ పూర్ లో జన్మించిన ఆయన.. సినిమాల్లో నటించి బెస్ట్ విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరుపున 2014 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసిన రవి కిషన్ అక్కడ 42,759 ఓట్లు లేదా మొత్తం ఓట్లలో 4.25 శాతం మాత్రమే సాధించాడు. ఫిబ్రవరి 2017 లో కిషన్ కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి రంభువల్ నిషాద్‌పై 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేసి గెలిచారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…