Ratnam Movie On OTT : తమిళ హీరోనే అయినా సౌత్ ఇండియా మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న హీరో విశాల్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా మూవీలు చేస్తున్నాడు. ఇలా ‘మార్క్ ఆంటోనీ’ వంటి హిట్ తర్వాత విశాల్ ‘రత్నం’ మూవీ చేశాడు. ఏప్రిల్ 26న తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకేసారి రత్నం థియేటర్లలో విడుదలైంది. రోటీన్ స్టోరీ అనే టాక్ వచ్చినా తమిళ్ తో బాగానే కలెక్షన్లు వచ్చాయి. అయితే తెలుగులో మాత్రం విశాల్ సినిమాకు నిరాశే ఎదురైంది. అయితే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, ఊహకందని ట్విస్టులు విశాల్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. అలాగే ప్రియా భవానీ శంకర్ నటన కూడా మెప్పించింది.
థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన రత్నం సినిమా నెల తిరక్క ముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సొంతం చేసుకోగా, ఈ చిత్రం మే 23 అర్ధరాత్రి నుండి ఓటీటీలోకి స్ట్రీమింగ్ వచ్చింది. సింగం చిత్రాల ఫేమ్ హరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించింది. స్టోన్‌బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాత. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా విడుదల చేశారు.. థియేటర్లలో దాదాపుగా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న రత్నం సినిమా ఓటీటీలో మాత్రం అన్నింటిని దాటి టాప్‌లో ఉండటం ఆశ్చర్యంగా, విశేషంగా మారింది.
అమెజాన్ ప్రైమ్‌లో రత్నం తర్వాత మడగావ్ ఎక్స్‌ప్రెస్, మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ ఆవేశం, హిందీ యాక్షన్ ఫిల్మ్ యోధ, సూపర్ హిట్ వెబ్ సిరీస్ పంచాయత్, విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్, హీరో సత్యదేవ్ కృష్ణమ్మ, షాహిద్ కపూర్-కృతి సనన్ తేరి బాతోన్ మే ఐసా ఉల్జా జియా, గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలు వరుసగా ఉన్నాయి. వీటిలో మలయాళంలో సుమారు వంద కోట్లకుపైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన ఆవేశం సినిమాను దాటి రత్నం ముందంజలో ఉండటం విశేషంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు బోర్డర్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా స్టోరీ ఉండగా.. సముద్రఖని, యోగిబాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.