బుల్లితెరపై కొన్ని జంటలకు మంచి పాపులారిటీ దక్కింది. వారిలో రష్మీ గౌతమ్ సుధీర్ జంట తప్పక ఉంటారు. రష్మీ.. సుడిగాలి సుధీర్‌తో ప్రేమలో ఉందనే వార్తలు ఎన్నో రోజులుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఇక గతంలో వీరిద్దరు సైతం తమ గురించి వస్తున్న రూమర్స్ పట్ల అనేకసార్లు వివరణ ఇచ్చుకున్నారు. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని.. ప్రేమ లేదంటూ చెప్పుకొచ్చారు. ఇక తాజాగా మరోసారి సుధీర్‌తో ఉన్న బంధం గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది రష్మీ. తాజాగా ఈ అమ్మడు నందు సరసన బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమా చేసింది. ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్‌లో రష్మీ మాట్లాడుతూ.. నా గురించి అన్ని విషయాలు చెప్పాల్సిన పనిలేదు.
అది నా వ్యక్తిగతం . “అలాగే సుధీర్‌కు నాకు మధ్య ఉన్న బంధం ఏదైనా కావొచ్చు. దాని గురించి ప్రతి ఒక్కరికీ వివరించలేను. కొన్ని విషయాలు నాలోనే దాచుకుంటాను. భవిష్యత్తులో ఏం అవుతుందో తెలియదు. ఏం జరిగినా.. అది తప్పకుండా అందరికీ తెలుస్తుంది. మేం ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటామో.. అదే ఆన్ స్క్రీన్ పై కనిపిస్తుంది. మాది పదేళ్ల ప్రయాణం. మేం అనుకొని అదంతా చేయలేదు. ఓ మ్యాజిక్ లా మా కెమిస్ట్రీ అందరినీ ఆకర్శించింది” అని రష్మీ చెప్పుకొచ్చింది. ఇక గాలోడు ట్రైలర్ విడుదల సందర్భంగా సుధీర్ మీడియాతో మాట్లాడుతూ.. రష్మీ నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అంతకు మించి ఏమీ లేదన్నాడు.
నేను ఎక్కడికెళ్లినా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. రష్మీతో నీ రిలేషన్ చెప్పమంటున్నారు. చాలా కాలం కలిసి పని చేయడం వలన జనాలు నిజం చెప్పినా నమ్మడం లేదన్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికీ సుధీర్, రష్మీలకు షోలో భాగంగా పలుమార్లు పెళ్లిళ్లు చేశారు. అలా చేసిన ప్రతి సారి కూడా ఆ షో మంచి సక్సెస్ అయిందనే చెప్పాలి.