Rashi Khanna : రాశీ ఖన్నా అలియాస్ ఏంజెల్ అరుణ ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా… ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఇక అక్కడ నుండి వరుస అవకాశాలు అందిపుచ్చకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం రాశీ ఖన్నాకి తెలుగులో అవకాశాలు పెద్దగా రావడం లేదు. దీంతో ఈ భామ తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. మరోవైపు వెబ్ సిరీస్‌లో సైతం నటిస్తూ అదరగొడుతుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫర్జ్’ వెబ్ సిరీస్‌లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో పాటు రాశీ ఖన్నా నటించారు. ఇందులో మేఘా వ్యాస్ అనే ఆర్బీఐ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ సిరీస్‌లో ఈమె నటనకు మంచి పేరే వచ్చింది.
రాశీ ఖన్నా గతేడాది గోపీచంద్‌తో పక్కా కమర్షియల్ సినిమా చేసింది . ఇందులో లాయర్ ఝాన్సీ పాత్రలో ప్రేక్షకులను తనదైన శైలిలో మెప్పించింది. మరోవైపు విక్రమ్ కుమార్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన ‘థాంక్యూ’ మూవీతో పలకరించింది. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఈ రకంగా తెలుగులో వరుసగా పరాజయాలు రాశీ ఖన్నాను పలకరించాయి. ఆ మధ్య దక్షిణాది పరిశ్రమపై రాశీ ఖన్నా నెగటివ్ కామెంట్స్ చేశారని వార్తలు వచ్చాయి. దక్షిణాది చిత్ర పరిశ్రమను దూషిస్తూ తాను వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. భాష ఏదైనా.. సినిమా ఏదైనా, తాను చేసే ప్రతి సినిమాపై గౌరవం మర్యాద ఉంటుందన్నారు. దయచేసి ఆ ప్రచారాలను ఇకనైనా ఆపండంటూ ఆ వివాదానికి ముగింపు పలికారు రాశీ ఖన్నా.
ఇక ఈ భామ సినిమాల పరంగా ఎలా ఉన్నా సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తుంది. ట్రెండీ దుస్తులలో కేక పెట్టించే అందాలతో కుర్రాళ్లకి గాలం వేస్తుంటుంది. తాజాగా రాశీ ఖన్నా ఎయిర్ పోర్ట్‌లో క్లీవేజ్ షోతో మతులు పోగొట్టింది. రాశీ క్యూట్ లుక్స్ చూసి ప్రతి ఒక్కరు ఆమెని కెమెరాలలో బంధించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో స్టాప్ ఇట్ అంటూ కాస్త అసహనం వ్యక్తం చేసింది. ఏది ఏమైన రాశీ క్రేజీ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.