Ram Mohan Naidu : స్కిల్ స్కాం కేసులో అరెస్టై నెలరోజులకుపైగా రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన భద్రతపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు కొద్దిరోజులుగా ఆందోళనలు వ్యక్తం చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఆయనకు స్కిన్ అలర్జీ రావడంతో లోకేష్ బావోద్వేగంతో కూడిన ట్వీట్ పెట్టారు. అందులో సినిమాలోని డైలాగ్‌ని కోడ్ చేసి చంద్రబాబుకు జైలులో భద్రత లేదని..ఆయన ఆరోగ్య పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. లోకేష్ ట్వీట్ చూసిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయం లోకేష్ ట్వీట్ చూసి భాద అనిపింది.చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ వ్యక్తం చేసిన ఆందోళనను ఒక కొడుకుగా అర్థం చేసుకోగలను అన్నారు. లోకేష్ చెప్పింది వాస్తవమే అయితే ఈ పరిస్థితి భాదకరమన్నారు కేటీఆర్.
అయితే స్నేహ బ్యారక్‌లో చంద్రబాబు ఉన్న గదిలో అధికారులు 8 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే చికిత్స అందించేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ముందు జాగ్రత్త చర్యగా ఒక వీఐపీ రూమును కూడా సిద్ధం చేశారు. చంద్రబాబు నెల రోజులు వ్యవధిలో జైల్లో ఒక కిలో బరువు పెరిగారని జైలు అధికారులు చెబుతున్నారు. చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారంటూ రెండో రోజు కూడా జైలు అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
తాజాగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు తన ఆరోగ్యాన్ని ఎలా చూసుకుంటారో అందరికి తెలుసు. జగన్ తన చిన్నాననే చంపించాడు. చంద్రబాబుని ఏం చేస్తాడనే టెన్షన్ అందరికి ఉంది. ఆయనకి తన పర్సనల్ డాక్టర్ తో చెకప్స్ చేయించాలి. చంద్రబాబు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ చేయాలి. సజ్జల ఆయనే లాయర్, ఆయనే డాక్టర్ అన్నట్టు మాట్లాడతాడు. అజలు సజ్జల ఎవడు, బోడిగాడివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రామ్మోహన్ నాయుడు. జగన్‌తో పాటు సజ్జలని ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు ఎంపి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…