Ram Gopal Varma : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ నిత్యం సెటైరికల్ కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుంటారు. ఆయన ఇటీవల పవన్ కళ్యాణ్‌ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ కనిపిస్తున్నారు. సినిమాల కన్నా కూడా వివాదాలతోనే ఆయన హాట్ టాపిక్ అవుతున్నాడు. ప్రస్తుతానికి ఆయన వ్యూహం అనే సినిమా చేస్తున్నాడు దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఎవరెవరు ఎలా ప్రతిస్పందించారు. ఆ తర్వాత ఎలాంటి కుట్రలు జరిగాయి అనే విషయం మీద తన కోణాలను ఆవిష్కరించేందుకు ఈ సినిమా చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. రంగం సినిమాతో తెలుగువారికి పరిచయమైన అజ్మల్ ఈ సినిమాలో వైయస్ జగన్ పాత్రలో నటిస్తున్నాడు.
వ్యూహం సినిమాకి సంబంధించి పలు ఫొటోలు, వీడియోలు ఇప్పటికే విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ తాజాగా పవన్ పోస్టర్ గురించి ఆసక్తికర కామెంట్ చేశారు. కొద్ది రోజుల క్రితం వ్యూహం సినిమా నుంచి నేను విడుదల చేసిన ఫోటో కింద ఫోటో రాత్రి పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్న ఫోటో అని ఆయన షేర్ చేశాడు. పవన్ నా పోస్టర్‌ని కాపీ కొట్టాడు అని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తొమ్మిది ప్రశ్నలు సంధించారు. ఈ తొమ్మిది ప్రశ్నలకు కేవలం ఒక్క పదంలో సమాధానాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ తొమ్మిది ప్రశ్నలూ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించినవే.

ఈ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంతో.. చంద్రబాబుకు మద్దతుగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయం తెలిసిందే. కుట్రపూరితంగానే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రామ్ గోపాల్ వర్మ ఈ 9 ప్రశ్నలను సంధించారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) ద్వారా స్పందించారు. గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారూ, నా ఈ క్రింది తొమ్మిది ప్రశ్నలకు కేవలం వన్ వర్డ్ ఆన్సర్లు ఇవ్వగలరని నా రిక్వెస్ట్ అంటూ ఆయన ట్వీట్ చేయగా, దీనికి పవన్ స్పందిస్తాడా లేదా అనేది చూడాలి.