Ram Gopal Varma : ఈమధ్య కాలంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు, వైసీపీ నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత యుద్ధ వాతావరణం నెలకొంది. పవన్ ఒక మీటింగ్ లో చెప్పు చూపించి మాట్లాడినప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య వైరం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే రోజూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, బూతులు తిట్టుకోవడం చేస్తున్నారు. అయితే ఇది చాలదన్నట్లు మరొక వార్త ఫిలింనగర్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. పవన్ 3 పెళ్లిళ్లపై సినిమా తీయనున్నారని ఒక వార్త వైరల్ అవుతోంది.
గతంలో వర్మ లక్ష్మీస్ ఎన్‌టీఆర్, అమ్మ రాజ్యంలో కడప రెడ్లు వంటి సినిమాలను తీసి వైసీపీకి పరోక్షంగా సహకారం అందించారు. మొదటి నుంచి వర్మ వైసీపీకి మద్ధతుగానే ఉన్నారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో సీఎం జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వర్మను ఆహ్వానించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వర్మ త్వరలోనే సీఎం జగన్‌తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వర్మ త్వరలో పవన్ 3 పెళ్లిళ్లపై సినిమా తీస్తారని.. అందుకు వైసీపీయే పూర్తిగా వెనుక ఉండి నడిపించబోతుందని తెలుస్తోంది.
![Ram Gopal Varma : పవన్ 3 పెళ్లిళ్లలపై వర్మ సినిమా..? టైటిల్ ప్యాకేజీ స్టార్..? వైసీపీ సహకారంతోనే..? అందుకనే జగన్‌తో మీటింగ్ అట..? Ram Gopal Varma reportedly planning on film pawan kalyan 3 marriages](http://3.0.182.119/wp-content/uploads/2022/10/ram-gopal-varma.jpg)
ఇక వర్మ పవన్‌పై తీయబోయే సినిమాకు ప్యాకేజీ స్టార్ అనే టైటిల్ ను పెడుతున్నారట. ఈ క్రమంలోనే పవన్ ఇమేజ్‌ను పూర్తిగా దెబ్బ తీసేందుకు.. ఈ మూవీని నిర్మిస్తారని అంటున్నారు. అలాగే 2024 ఎన్నికలక ముందు రిలీజ్ అయ్యేలా ఈ మూవీని తీయనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇదంతా వైరల్ అవుతున్న సమాచారమే. ఇందులో నిజమెంత ఉంది ? అన్నది తెలియాల్సి ఉంది. కానీ గతంలో వర్మ ఇలాంటి వివాదాస్పద చిత్రాలు తీశారు కనుక.. ఈ చిత్రం కూడా తీస్తారని చెప్పడంలో సందేహం లేదు. కానీ ఈ మూవీని తీస్తారా.. లేదా.. అనేదే డౌట్. మరి ఇందుకు జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.