Ram Charan On Acharya Movie : చిరంజీవి తనయడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన సత్తా చూపిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు రామ్ చరణ్. ఆయన చివరిగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ కామియో పాత్రలో నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలైంది. ఇది బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని చవి చూసింది. అయితే ఈ మూవీ విషయంపై తాజాగా రామ్ చరణ్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ ప్రేక్షకులు సినిమా చూసే పద్ధతి మారిపోయిందని ఖచ్చితంగా కంటెంట్ ఉంటేనే వారు చూస్తున్నారని చెప్పారు.
సినిమాలో కంటెంట్ ఉందని వారు నమ్మితేనే సినిమా ధియేటర్లకు వస్తున్నారని, ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కూడా తాను ఒక చిన్న గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన సినిమా రిలీజ్ అయిందని అయినా సరే ప్రేక్షకులను ఆ సినిమా థియేటర్లకు రప్పించడంలో విఫలమైందంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఆచార్యగురించి ప్రస్తావించారు. వెండితెరపై ప్రేక్షకుల్ని నిరాశపరిచిన ఆచార్య బుల్లితెరపై డిజాస్టర్‌గా నిలిచింది. చిరంజీవి కెరీర్‌లో అతి తక్కువ టీఆర్‌పీ రేటింగ్స్ సొంతం చేసుకున్న సినిమాగా ఈ మూవీ నిలవడం విశేషం.
![Ram Charan On Acharya Movie : ఆచార్య మూవీ ఫ్లాప్‌పై ఎట్టకేలకు స్పందించిన రామ్ చరణ్.. ఏమన్నాడంటే..? Ram Charan On Acharya Movie finally he responded on flop](http://3.0.182.119/wp-content/uploads/2022/11/ram-charan-on-acharya-movie.jpg)
ఆచార్య సినిమాకు కేవలం 6.30 టీఆర్‌పీ రేటింగ్ మాత్రమే దక్కించుకున్నది.వంద కోట్లకుగాపై బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కేవలం వరల్డ్ వైడ్‌గా అతి తక్కువ కలెక్షన్స్ మాత్రమే రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా భారీ నష్టాలని చవి చూసిన నేపథ్యంలో తమ రెమ్యునరేషన్స్‌ను చిరంజీవి, రామ్‌చరణ్ వదులుకున్నారు. ఇక చరణ్ ప్రస్తుతం రామ్ చరణ్ 15 పేరుతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సోమవారం నుంచి ఇంగ్లాండ్లో జరగబోతుందని ఇదే ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పేర్కొన్నారు .ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం అధికారిక క్లారిటీ లేదు.