Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారాడు. చిరంజీవి తనయుడు అయిన కూడా తన సొంత టాలెంట్‌తో ఎదుగుతూ వస్తున్నాడు చరణ్. ఇటీవల ముంబై వెళ్లిన రామ్ చరణ్ అక్కడ తన భార్య, కూతురితో కలిసి సందడి చేశాడు..ఇక ముంబైలోని సీఎం కార్యాలయానికి వెళ్లి షిండేను పలకరించారు రామ్‍చరణ్ దంపతులు. వారికి సాదర స్వాగతం పలికారు సీఎం కుటుంబ సభ్యులు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. సీఎం షిండేకు పుష్పగుచ్ఛం ఇచ్చారు రామ్‍చరణ్, ఉపాసన. సీఎం కుమారుడు శ్రీకాంత్‍తో వారిద్దరూ ముచ్చటిస్తున్నట్టు మరో ఫొటోలో ఉంది. అభినందనలను, ఆలోచనలను ఈ సమావేశంలో పరస్పరం పంచుకున్నట్టు రామ్‍చరణ్ టీమ్ వెల్లడించింది.
రామ్ చరణ్ తన భార్యని సీఎంకి పరిచయం చేయించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక రామ్ చరణ్.. మహారాష్ట్ర సీఎంతో కలిసి దిగిన ఫొటోలను తన అఫీషియల్ ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. తమకు ఆతిథ్యం ఇచ్చిన మహారాష్ట్ర సీఎం, ఆయన కొడుకు శ్రీకాంత్ షిండేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముంబై ప్రజలు తమపై కురిపించిన ప్రేమ, ఆప్యాయత, అభిమానానికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తమ ఇంటికి వచ్చిన రామ్ చరణ్ దంపతులకు పుష్పగుచ్ఛంతోపాటు వినాయకుడి విగ్రహాన్ని ఇచ్చి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు షిండే. సినీ రంగంతోపాటు పలు అంశాలపై తమ మధ్య సానుకూల చర్చలు జరిగాయన్నారు. ఈ భేటీలో షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్, ఆయన సతీమణి వృశాలి ఉన్నారు.
![Ram Charan : ఎక్కడ తగ్గాలో రామ్ చరణ్‌కి బాగా తెలుసు.. తన భార్యని భలే పరిచయం చేశాడు..! Ram Charan introduced his daughter to him with upasana](http://3.0.182.119/wp-content/uploads/2023/12/ram-charan-1.jpg)
ఇక తమ కూతురు క్లీంకారకు ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ముంబైలోని మహాలక్ష్మి దేవాలయానికి వారు వెళ్లారు. కూతురితో సహా అమ్మవారిని దర్శించుకున్నారు.ఆర్ఆర్ఆర్ బ్లాక్‍బాస్టర్ హిట్ తర్వాత తదుపరి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు రామ్‍చరణ్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.