Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు 11ఏళ్ల తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జూన్ 20న ఉపాసన చిన్నారికి జన్మనివ్వగా, జూన్ 30న ఆ చిన్నారికి క్లింకార అని పేరు పెట్టారు. చిన్నారి రాకతో మెగా ఇంట ఆనందం అంతా ఇంతా కాదు. చిన్నారిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు ఉపాసన దంపతులు. జూలై 20కి పాప పుట్టి నెల రోజులు కావడం, అలానే అదే రోజు ఉపాసన బర్త్ డే కూడా కావడంతో ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు రామ్ చరణ్.. క్లీంకార వన్ మంత్ బర్త్ డేట్ వీడియోను టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ జోసెఫ్ ప్రతనిక్ డైరెక్ట్ చేసి నిర్మించారు.
ఈ వీడియోలో లెజెండ్రీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖా కొణిదెలతో పాటు ఉపాసన తల్లిండ్రులు శోభా కామినేని, అనీల్ కామినేని, కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. క్లీంకార పుట్టిన తర్వాత కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ పండుగ చేసుకున్నారు. వీడియోలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘మా పెళ్లై అప్పుడే పదకొండేళ్లు అయిపోయాయి. ఇన్నేళ్ల మా వైవాహిక జీవితంలో ఉపాసన ఎన్నో త్యాగాలు చేసింది. ఈ క్రమంలో చాలామంది మమ్మల్ని వాళ్ల మాటలతో బాధపెట్టారు. పెళ్లై ఇన్నేళ్లైనా ఏం చేస్తున్నారు?అని ఇబ్బంది పెట్టేవాళ్లు.
దానివల్ల మేమ చాలా ఒత్తిడికి గురయ్యాం. ఏదైనా సరైన టైంలో జరుగుతుందని నేను నమ్ముతా. ఆ నమ్మకంతోనే క్లింకార సరైన టైంలో మా జీవితాల్లోకి అడుగుపెట్టింది. తనను ఎత్తుకున్న మొదటి క్షణం ఎంతో సంతోషంగా అనిపించింద’ని రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ వీడియోని చూసిన నెటిజన్స్ అయితే.. కోట్లిచ్చినా పొందలేని ఆనందమంటే ఇదే అంటూ కామెంట్ కూడా చేసారు.ఇక రామ్ చరణ్ ఉపాసన ప్రగ్నెంట్ అప్పటి నుండి కూడా ఇంటి పట్టునే ఉన్నారు. క్లింకార పుట్టాక తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ అనే చిత్రం చేస్తున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…