Ram Charan And Upasana : దాదాపు పది సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ దంపతులు పండంటి బిడ్డకు జన్మనవ్వబోతున్నారు. ఇప్పుడు మెగా కుటుంబం అంతా ఫుల్ జోష్ లో ఉంది. జులైలో ఉపాసనకు డెలివరీ డేట్ ఇవ్వగా, ఆ రోజు కోసం కుటుంబ సభ్యులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల స్నేహితుల సమక్షంలో ఉపాసన దుబాయ్‌లో బేబీ షవర్ వేడుక చేసుకున్నారు. అదే వేడుకను చిరంజీవి నివాసంలోనూ చేసుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం హైదరాబాద్‌లో ఈ ఫంక్షన్ నిర్వహించారు.
అయితే రీసెంట్‌గా జరిగిన వేడుకలో అల్లు అర్జున్ కూడా సందడి చేశారు.. ఉపాసనతో దిగిన ఫొటోలను బన్నీ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు. తనకు ఎంతో ఆనందంగా ఉందంటూ ఉపాసనకు శుభాకాంక్షలు చెప్పారు. ”సో హ్యాపీ ఫర్ మై స్వీటెస్ట్ ఉప్సీ” అని క్యాప్షన్ రాశారు. సానియా మీర్జా, సుస్మితతో పాటు ఉపాసన, రామ్ చరణ్ స్నేహితులు కూడా హాజరయ్యారు. ఈ ఫొటోలను చూసిన అల్లు – మెగా ఫ్యామిలీల అభిమానులు చాలా హ్యపీగా ఉన్నారు. అయితే రామ్ చరణ్ కి అబ్బాయి పుడతాడని అందరు అనుకుంటున్నారు.

కాని కొందరు అమ్మాయి అని ఆధారాలతో సహా చెబుతున్నారు. రామ్ చరణ్ మాట్లుడుతూ… థర్డ్ జూన్ ఆన్ ‘హెర్’ వే… అన్నారు. జూన్ నెలలో అమ్మాయి రాబోతుందని ఆయన ఫ్లోలో అనేశారు. కాబట్టి ఇదొక ఆధారంగా అనుకోవచ్చు. ఇక ఇటీవల జరిగిన ఉపాసన సీమంత వేడుకలో పింక్ కలర్ హైలెట్ చేశారు. పింక్ థీమ్ అనేది అమ్మాయికి సూచన అని, పుట్టబోయేది అమ్మాయని తెలిసిన రామ్ చరణ్-ఉపాసన అలా సీమంత వేడుక అలకరించారని అంటున్నారు. ఇక మూడో హింట్ గా అల్లు అర్జున్ గిఫ్ట్ ని ప్రస్తావిస్తున్నారు. బన్నీగిఫ్ట్ వ్రాప్ తో కూడిన పింక్ కలర్ హార్ట్ ఎమోజీ పోస్ట్ చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉపాసనకు పుట్టబోయేది అమ్మాయే అని చెబుతున్నారు.