Ram Charan : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ ఫ్యామిలీలో జరిగే ఏ ఈవెంట్ అయిన సరే హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. మెగా ఫ్యామిలీ ప్రతి పండుగని కుటుంబమంతా కలిసి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారని అందరికి తెలిసిందే. ఈ సంక్రాంతి పండుగని కూడా అలాగే అందరూ కలిసి జరుపుకుంటున్నారు. అయితే ఈ సంక్రాంతి చాలా స్పెషల్. ఎందుకంటే ఈ సంక్రాంతికి కొత్త మనవరాలు, కొత్త కోడలు మెగా ఇంట అడుగు పెట్టారు. దీంతో మెగా ఫ్యామిలీ కొత్త మహాలక్ష్మిలతో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటున్నారు.ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఒక్కొక్కరుగా బెంగళూరు ఫార్మ్ హౌస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ కి బెంగళూరు ఫార్మ్ హౌస్ విడిది అయ్యింది. ఆల్రెడీ అక్కడికి చేరుకున్న మెగా ఫ్యామిలీ అక్కడ పండగని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అక్కడి విశేషాలన్నిటిని మెగా వారి పెద్ద కోడలు ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీ పెడుతూ ఆడియన్స్ కి తెలియజేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈరోజు ఉదయం అల్లు అర్జున్, స్నేహారెడ్డి బెంగళూరు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ వద్ద అల్లు కపుల్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్.. ఇలా మెగా హీరోలంతా ఫ్యామిలీతో భోగి పండగను సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఉపాసన షేర్ చేసిన పోస్ట్‌లో కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అల్లు శిరీష్, అల్లు అర్జున్ కుమార్తె అర్హ, చిరు సతీమణి సురేఖ తదితరులు కనిపిస్తున్నారు. ఇక ఇదే వీడియోలో కొత్త కోడలు లావణ్య సున్నుండలు చేస్తూ కనిపిస్తున్నారు. ఇక నిన్న జనవరి 13న పంజా వైష్ణవ తేజ్ పుట్టినరోజు కావడంతో అక్కడే బర్త్ డే సెలబ్రేషన్స్ ని కూడా నిర్వహించారు. మొత్తానికి మెగా సెలబ్రేషన్స్ అదిరిపోయాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…