Rakul Preet Singh : ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో నానా రచ్చ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ కే పరిమితం అయింది. అక్కడ కూడా పెద్దగా సక్సెస్ లు అందుకోని ఈ ముద్దుగుమ్మ ఆఫర్స్ మాత్రం బాగానే అందిపుచ్చుకుంటుంది. రకుల్ నటించిన థాంక్ గాడ్ చిత్రం ఈ నెల 25న రిలీజ్ అవుతుంది. ఇది కాకుండా డాక్టర్ జీ, ఛత్రీవాలి, ఇండియన్ 2 సినిమాల్లో రకుల్ నటిస్తున్నారు. అయితే రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది.
తాజాగా అబిమానులతో చిట్ చాట్ నిర్వహించిన రకుల్ ప్రీత్ సింగ్.. తాను తెలుగు సినిమాలు చేయకపోవడంపై బదులు ఇచ్చింది. ‘ఈ మధ్య కాలంలో నేను తెలుగు సినిమాల్లో నటించటం లేదనే సంగతి నాకు కూడా తెలుసు. కానీ త్వరలోనే తప్పకుండా తెలుగులో నటిస్తాను. తెలుగు అభిమాలను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే తెలుగు సినీ పరిశ్రమే కారణం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది రకుల్. దీంతో ఇన్నాళ్లు ఈ అమ్మడిపై కాస్త కినుకుగా ఉన్న తెలుగు అభిమానులు శాంతించారు.
ఇదిలా ఉంటే 2021 అక్టోబర్ నెలలో తన ప్రియుడిని రకుల్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రియుడిని పరిచయం చేసి ఏడాది కావొస్తున్నా ఇంకా పెళ్లి గురించి రకుల్ స్పందించడం లేదు. దీనిపై అభిమానులే అనేక రకాలుగా ఆలోచనలు చేస్తున్నారు. తాజగా అమన్ పెళ్లి గురించి కన్‌ఫాం చేసినట్టు ప్రచారం జరగగా, రకుల్ స్పందించింది. ‘అమన్, నువ్వు నా పెళ్లి గురించి నాక్కూడా చెప్పాలి కదా బ్రో. నా జీవితం గురించి నాకే తెలియకపోవటం కామెడీగా ఉంది’ అంటూ ఆసక్తికర కామెంట్స చేసింది. రకుల్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…