Rakul Preet Singh : కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన రకుల్ ప్రీత్ సింగ్ చూడచక్కని అందంతో కుర్రకారు హృదయాలు దోచుకుంటుంది. దక్షిణాదిన తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కెరీర్ ప్రారంభంలో తెలుగు, తమిళ చిత్రాలకే ప్రాధాన్యత ఇచ్చిన ఆమె ఈ మధ్య హిందీ ఇండస్ట్రీ వైపే ఫోకస్ చేసింది. అదీ కాకుండా హీరోయిన్స్ మధ్య పెరిగిన పోటీ వల్ల కూడా ఈమెకు అవకాశాలు గండి పడ్డాయనే చెప్పాలి. అయితేనేం రకుల్ ప్రీత్ చాలా కూల్‌గా హిందీ సినిమాల్లో తనకు నచ్చిన పాత్రల్లో నటిస్తోంది సోషల్ మీడియాలోనూ రకుల్ ప్రీత్ చాలా యాక్టివ్‌గా ఉంటోంది.
ఈ అమ్మడు ఎక్కువగా గ్లామరస్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్.. ఎయిర్ పోర్ట్‌లో రచ్చ చేస్తుంది. టైట్ డ్రెస్ లో కేక పెట్టించే అందాలతో మంత్ర ముగ్ధులని చేసింది. తన ఎద అందాలతో మత్తెక్కించిన రకుల్ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. రకుల్ కేక పెట్టించే అందాలని ప్రతి ఒక్కరు కూడా తన్మయత్వం చెందుతున్నారు. ప్రస్తుతం పిక్స్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ, మహేష్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో లాంటి హిట్స్ ని ఖాతాలో వేసుకుంది.
రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ తో, నటనతో సౌత్ లో స్టార్ గా ఎదిగింది. ఆ మధ్యన డ్రగ్స్ కేసు వివాదం కూడా రకుల్ ని ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం రకుల్ తన సినిమాలపై ఫోకస్ పెడుతూ బాలీవుడ్ లో రాణించే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు గత ఏడాది రకుల్ ప్రకటించింది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు. జాకీ భగ్నానీ బాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నారు. జాకీ వ్యాపార వేత్త కూడా. పూజా ఎంటర్టైన్మెంట్స్ అధినేత వశు భగ్నానీ తనయుడే ఈ జాకీ భగ్నానీ. ప్రస్తుతం రకుల్ హిందీలో పలు చిత్రాల్లో నటిస్తోంది. రకుల్ తెలుగులో చివరగా నితిన్ చెక్ , వైష్ణవ్ తేజ్ కొండపొలం చిత్రాల్లో నటించి అలరించింది.