Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్.. ఈ అమ్మడు ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. 2009వ సంవత్సరంలో గిల్లి అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ క్యూట్ బ్యూటీ.. ఆ తర్వాత రెండేళ్లకే కెరటం అనే సినిమాతో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ, హిందీ ఇండస్ట్రీలోనూ కాలు మోపి తన అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగులో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, రఫ్, లౌక్యం, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకీ నాయకా వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.
ఒక వైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ అందాల రచ్చ చేస్తుంటుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, భాషల అభిమానులకు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా అందుబాటులో ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉంటుంది. తన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ కుర్రకారుకు ఫీవర్ తెప్పిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసి కాక రేపింది.
గులాబి రంగు డ్రెస్‌లో నాజూకు భామ రకుల్ ప్రీత్ సింగ్ మరో కొత్త ఫొటోషూట్‌తో మెరిసింది. ఇందులో తన అందాలన్నింటినీ ఆరబోస్తూ మెస్మరైజ్ చేసింది. ఆ పిక్స్ చూసి నెటిజన్స్ మైమరచిపోతున్నారు. రకుల్ అందాలని తెగ ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం రకుల్ క్యూట్ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.మె వేసుకున్న డ్రెస్సు కారమంగా మొహం కూడా తెగ మెరిసిపోతుంది. స్లీవ్ లెస్ డీప్ నెక్ డ్రెస్సు పైకి చిన్న చోకర్ వేసుకుంది. ఇది చూసి చాలా హాట్ గా ఉన్నావు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్, వామ్మో ఏంటి ఈ అందాలు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ పిక్స్ వైరల్‌గా మారాయి.