Rakul Preet Singh : కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. లీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగి అందరు అగ్ర హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. రకుల్ లేలేత అందాలతో వెండితెర తడిసి ముద్దయింది. అందానికి అందం అందుకు నటనా ప్రతిభ తోడు కావడంతో పంజాబీ పాప రకుల్ గ్రాఫ్ ఉవ్వెత్తున ఎగిసింది. ఫిట్ నెస్ పరంగా స్పెషల్ కేర్ తీసుకుంటూ ఏళ్ల తరబడి అందాలతో అట్రాక్ట్ చేస్తున్న ఈ ముద్దుగమ్మ అమాంతం ఫాలోయింగ్ పెంచుకుంది. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ, కిక్ 2 వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న రకుల్.. క్రమంగా తన డిమాండ్ ఏంటో తెలుసుకొని రెమ్యూనరేషన్ కూడా బాగానే పెంచేసింది. అయినప్పటికీ రకుల్ డేట్స్ కోసం పోటీపడ్డారు తెలుగు దర్శకనిర్మాతలు. ఇప్పుడు మాత్రం రకుల్‌కి తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి.
ప్రస్తుతం బాలీవుడ్‌లో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నా కూడా రకుల్ అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతుంది. ఇక టాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్‌ను అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం పెద్ద రచ్చకు దారితీసింది. రకుల్ లాంటి హాట్ బ్యూటీ ఈడీ అధికారుల విచారణకు వెళ్లడం హాట్ టాపిక్ అయింది.ఒకప్పుడు హీరోయిన్‌గా నటించడానికి ఒక్కో సినిమాకు కోటి 50 లక్షల వరకు అందుకున్నారట రకుల్. కాగా ప్రస్తుతం డైలీ పేమెంట్స్ విధానంలో భాగంగా.. రోజుకు మూడు లక్షలు వరకు తీసుకుంటున్నారని సమాచారం. రీసెంట్‌గా రకుల్ తన బర్త్‌డే సెలబ్రేషన్స్ ని తన బాయ్ ఫ్రెండ్, ఫ్రెండ్స్, తోటి హీరోయిన్స్ తో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
ప్రస్తుతం ఈ మూడు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. తమిళంలో అయలాన్, ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తుండగా.. తెలుగులో కూడా విడుదల కానున్నాయి. అయితే రకుల్ రీసెంట్‌గా ఒప్పో లాంచ్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది. ఈవెంట్‌లో రకుల్ పొట్టి దుస్తులలో మైమరపించింది. కేక పెట్టించే అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. జీన్స్ టైప్ డ్రెస్‌లో రకుల్ గ్లామర్ షో పీక్స్ లో ఉందని చెప్పాలి. అమ్మడి అందాలకి ప్రతి ఒక్కరు చిత్తైపోతున్నారు.
https://youtube.com/watch?v=2MPk-7Y8LWo