తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఈ మధ్య టాలీవుడ్ అంతగా కలిసి రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. బాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో తన అందచందాలతో గ్లామర్ షో చేసి ఆకట్టుకున్న ఈ భామ హిందీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. కానీ ఆ సినిమాలు అనుకున్నంత సక్సెస్ కాకపోయినా అవకాశాలు మాత్రం తగ్గేదే లే అంటున్నాయి. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తన గ్లామర్ తో నార్త్ ప్రేక్షకులను తెగ ఎంటర్టైన్ చేస్తోంది.
2022 లో జాన్ అబ్రహం సరసన ఎటాక్ అనే సినిమా చేసింది. అలానే అజయ్ దేవగన్ రన్‌వే 34, అక్షయ్ కుమార్ కట్‌పుట్లి (ఓటీటీలో విడుదల), ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ జి మరియు అజయ్ దేవగన్ థాంక్స్ గాడ్ వంటి చిత్రాలలో నటించింది. ఇవి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కాగా, రకుల్‌కి ప్రత్యేక క్రేజ్ కూడా తెచ్చిపెట్టలేకపోయాయి. సాధారణంగా వరుస ఫ్లాపులు వస్తే ఇక అవకాశాలు రావడం చాలా కష్టం. కాని ప్రస్తుతం రకుల్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
రకుల్ చేతిలో హిందీ చిత్రాలు చత్రివాలి, మేరే పట్నీ కి రీమేక్, శివకార్తికేయన్ అయాలాన్, కమల్ హాసన్ భారతీయుడు 2 మరియు మరొక ద్విభాషా చిత్రంతో సహా మరో ఐదు చిత్రాలు విడుదలకి సిద్ధంఆ ఉన్నాయి.స్టార్స్‌తో ఉన్న రిలేషన్ కారణంగా ఆమెకి ఇన్ని ఆఫర్స్ వస్తున్నాయంటున్నారు. అయితే ఒక్క హిట్ అయిన రకుల్‌కి పడితే మళ్లీ ఈ అమ్మడి క్రేజ్ ఊపందుకోవడం ఖాయం. కాగా, రకుల్ ప్రీత్ సింగ్ చివరిగా తెలుగులో కొండపొలం మూవీలో నటించింది. ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జోడి కట్టింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ కొండపొలం బాక్సాఫీస్ వద్ద అంత సక్సెస్ కాలేదు.