Rakesh Master : మొన్నటి వరకు సోషల్ మీడియాలో తెగ సందడి చేసిన రాకేష్ మాస్టర్ గత ఆదివారం హఠాన్మరణం చెందాడు. సన్ స్ట్రోక్ వలన చనిపోయాడని కొందరు అంటుంటే, మరి కొందరు ఇతర అనారోగ్య సమస్యల వలన మరణించాడని అంటున్నారు. షుగర్ లెవెల్స్ పెరగడం, బీపీ పడిపోవడం లాంటి సమస్యలు అలాగే పలు అవయవాలు వైఫల్యం లాంటి వల్లనే రాకేష్ మృతి చెంది ఉంటాడని చెప్పుకొస్తున్నారు. అయితే రాకేష్ మాస్టర్ స్వతహాగా మంచి వాడు. మద్యం సేవించిన తర్వాత చాలా మందితో గొడవపడేవాడు. భార్య పిల్లలతోనే కాకుండా శేఖర్ మాస్టర్‌తో కూడా అలానే గొడవపడ్డారు. తాగినది దిగిన తర్వాత ఉదయం వారికి క్షమాపణ చెప్పేవారు.
రాకేష్ మాస్టర్ తండ్రి అభ్యుదయవాది. పుచ్చలపల్లి సుందరయ్యకు సన్నిహితుడు. అందువల్లే రాకేష్ మాస్టర్ పేరును రామిరెడ్డి నుంచి రాకేష్‌గా మార్చారు అని సోదరుడు తెలిపారు. అయితే రాకేష్ చనిపోయే సమయంలో అతని పెద్దాలు నల్లగా మారిపోయాయట. అప్పుడు యాసిడ్ తాగాడా అనే విషయంపై వైద్య నిపుణులను అడిగి తెలుసుకొన్నాను. యాసిడ్ తాగితే పెదవులు కమిలిపోతాయి. కానీ రాకేష్ విషయంలో యాసిడ్ తాగలేదు. తాగి ఉంటే అతడి పరిస్థితి అలా ఉండేది కాదు. చివరి నిమిషంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల అవయవాలు పనిచేయలేవని అని రాకేష్ మాస్టర్ సోదరుడు చెప్పారు.
రాకేష్ మాస్టర్ దాదాపు 1500లకు పైగా సినిమాలకు కొరియోగ్రఫీ చేశారంటే ఆయనకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే అంత గొప్ప స్థాయికి ఎదిగిన ఆయన మానసిక సమస్యలతో సినిమా అవకాశాలు కోల్పోయారు. అయితే రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు భారీగానే ఆస్తులు సంపాదించారు. ఆయనకు జూబ్లీహిల్స్ లో పెద్ద బంగ్లా ఉంది. దాంతో పాటు హైదరాబాద్ శివారులో రెండెకరాల భూమి కూడా ఉంది. దాని విలువ రూ.45 కోట్లు అని తెలుస్తోంది. లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఆయన ఆస్తుల మొత్తం విలువ కలిపి రూ.68 కోట్లు అని తెలుస్తోంది. ప్రస్తుతం అవన్నీ ఉన్నాయా లేదా అనే దానిపై అయితే క్లారిటీ లేదు.