Rajeev Kanakala : సుమ భర్త, నటుడు రాజీవ్ కనకాల మంచి నటుడు అనే విషయం మనందరికి తెలుసు.ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించిన రాజీవ్ కనకాల ఎలాంటి చిత్రాలలోనైనా సరే నటిస్తూ ఉంటారు. స్టూడెంట్ నెంబర్ -1 నుంచి తన కెరీర్ లో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు రాజీవ్ కనకాల. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పిన రాజీవ్, ‘దేవర’లో ఉంటానో? లేదో? తెలియదన్నారు. “ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన చాలా సినిమాల్లో చేశాను. ‘దేవర’లో ఉంటానో? లేదో? తెలియదు. ఇప్పటి వరకు నాకు ఎలాంటి సమాచారం లేదు అని రాజీవ్ చెప్పుకొచ్చాడు.
చరణ్ తో కలిసి ‘నాయక్’ సినిమా చేశాను. ‘రంగస్థలం’ చేశాను. కానీ, అప్పుడు పెద్దగా మాట్లాడలేదు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఆయనతోనే ఉంటాను. అన్ని సీన్లలో కనిపిస్తాను. శంకర్ గారు నా జుట్టుకు నల్లరంగు వేయమని చెప్పారు. నేను షాక్ అయ్యాను. షూటింగ్ జరిగేప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నాను. నాలుగు టేకులు తీసుకున్నాను. నేను నటన మర్చిపోయానా? అని షేక్ అయ్యాను. రామ్ చరణ్ తో సైకిల్ తొక్కే సీన్ ఉంటుంది. అప్పుడు కూడా చేయలేకపోయాను. చెర్రీ నన్ను కంగారు పడకండి. అసరమైతే బ్రేక్ తీసుకుందాం అని చెప్పి ప్రోత్సహించాడు. చాలా మంచి మనిషి తను” అని తెలిపారు. ఇక ఈ మధ్య తాను చాలా లావు అయ్యాడు. దానిపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ ఈ మధ్యనే తనకు ఫుడ్ పాయిజన్ అయిందని.. హాస్పిటల్లో అడ్మిట్ అయి సెలైన్ కూడా ఎక్కించారట..అప్పుడు ఆసుపత్రిలో ఫుడ్ ఇచ్చేవారు అటు ఇంటి నుంచి ఆహారం కూడా వచ్చేది.. ఏది వేస్ట్ చేయకూడదని ఉద్దేశంతో చాలా తినేశానని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక రాత్రిపూట ఎక్కువగా భారీగా లాగిన్ చేయడంతో అలా తెలియకుండానే చాలా బరువు పెరిగిపోయాను అంటూ తెలియజేశారు రాజీవ్ కనకాల. ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావ వేడుకలలో క్రికెట్ ఆడడం జరిగింది వరంగల్లో ఆ సమయంలో తన కాలు బెణికిందని తెలిపారు. వీటికి తోడుగా లావు పెరగడంతో సరిగ్గా నడవలేక పోతున్నాను నేను తినేటప్పుడు ఎవరైనా చాలు ఆపేయమని చెబితే మాత్రం చాలా కోపం వస్తుంది అంటూ తెలిపారు రాజీవ్ . అయితే ఇప్పుడు బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నాడు.