బాబోయ్.. ఆస్కార్ నామినేష‌న్‌కి ఆర్ఆర్ఆర్‌ని తీసుకొచ్చేందుకు రాజ‌మౌళి అంత ఖ‌ర్చు పెట్టారా..!

సినిమా రంగంలో ఉన్నవారంతా ఆస్కార్ అవార్డ్ గురించి ఎంత‌గా క‌ల‌లుకంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆస్కార్ అనేది తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు అందని ద్రాక్ష‌గానే మిగిలింది . అయితే గత ఏడాది కాలంలో, దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆస్కార్ ఫీవర్ పెరిగిందనడంలో సందేహం లేదు. ఈ ఘనత ‘ఆర్ఆర్ఆర్’ మూవీకే దక్కుతుంది. ఆర్ఆర్ఆర్ విడుదలై బాక్సాఫీస్ హిట్ కొట్టిన దగ్గర నుంచి ఈ సినిమా ఆస్కార్‌కు వెళుతుందన్న ప్రచారం మొదలైంది. అందుకు కార‌ణం ఈ సినిమాను మెచ్చుకుంటూ హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ట్వీట్లు చేయడంతో దేశంలో ఆస్కార్ జపం మొదలైంది.

పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ నామినేషన్‌ను దక్కించుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ అవార్డును కైవసం చేసుకుంది. అయితే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేష‌న్‌కి అంత ఈజీగా రాలేదు. ఆర్ఆర్ఆర్ ను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి భారీగా ఖర్చు చేశారట. ఈ నామినేషన్స్ కొరకు దాదాపుగా 100 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలుస్తోంది.

rajamouli spent huge money to bring oscar for rrr movie

అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి స్క్రీన్సులో స్క్రీనింగ్, గెస్టులకు పిఆర్ మెయింటెన్ మొదలుకొని ప్రతి విషయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. అయితే ‘కాంతారా’, ‘విక్రాంత్‌ రోణ’, ‘గంగూభాయ్‌’, ‘మి వసంతరావ్‌’, ‘రాకెట్రీ’, ‘తుజ్యా సాథీ కహీ హై’, ‘ఇరవిన్‌ నిళల్‌’ సినిమాలు 2023 ఆస్కార్ అవార్డులకు మన దేశం నుంచి సొంతంగా బరిలోకి దిగాయి. అయితే, ఇవేవీ ఏ విభాగంలోనూ నామినేట్ అవ్వలేదు. మామూలుగా ఒక సినిమా విడుదల చేసేముందు మార్కెటింగ్ ఎలా చేస్తారో, అలాగే ఆస్కార్ నామినేషన్లకు కూడా మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago