Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home ఆహారం

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి ల‌డ్డూలు.. రోజుకు ఒక‌టి తినాలి..!

Sahithi by Sahithi
July 19, 2022
in ఆహారం, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

మ‌నం చిరు ధాన్యాల‌యిన‌టు వంటి రాగుల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. రాగులు మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తాయి. ప్ర‌స్తుత కాలంలో వ‌స్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది రాగుల‌ను ఆహారంగా తీసుకుంటున్నారు. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బీపీ, షుగ‌ర్ వంటి వ్యాధుల‌ను నియంత్రించ‌డంలో రాగులు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం జావ, ఉప్మా, ఇడ్లీ, రోటీ వంటి వాటిని త‌యారు చేసుకుంటూ ఉంటాం. ఇవే కాకుండా రాగుల‌తో ఎంతో రుచిగా ఉండే ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా రాగి ల‌డ్డూల‌ను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి ల‌డ్డూల‌ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

రాగి పిండి – 250 గ్రా., పల్లీలు – 50 గ్రా., బెల్లం – 250 గ్రా., యాల‌కుల పొడి – చిటికెడు, నెయ్యి – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 100 ఎంఎల్.

ragi laddu recipe very healthy to us eat daily one

రాగి ల‌డ్డూల‌ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నెయ్యి వేసి నెయ్యి వేడ‌య్యాక రాగిపిండిని వేసి కొద్దిగా రంగు మారే వ‌ర‌కు చిన్న మంట‌పై వేయించుకోవాలి. త‌రువాత ప‌ల్లీల‌ను కూడా వేసి వేయించి పొట్టు తీయాలి. ఈ ప‌ల్లీల‌ను ఒక జార్ లో వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా ప‌లుకుగా ఉండేలా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో లేదా క‌ళాయిలో బెల్లాన్ని , నీళ్ల‌ను పోసి బెల్లం క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. బెల్లం క‌రిగి త‌రువాత వ‌డ‌పోసి మ‌ర‌లా తీగ‌పాకం వ‌చ్చే వ‌ర‌కు వేడి చేయాలి.

బెల్లం పాకం వ‌చ్చిన త‌రువాత యాల‌కుల పొడిని వేసి క‌ల‌పాలి. త‌రువాత క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టిన ప‌ల్లీల‌ను, రాగి పిండిని వేసి ఉండలు లేకుండా బాగా క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్ర‌మం చ‌ల్ల‌గా అయ్యి గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడు చేతికి నెయ్యిని రాసుకుంటూ త‌గిన ప‌రిమాణంలో పిండిని తీసుకుంటూ ఉండ‌లుగా చుట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి ల‌డ్డూలు త‌యార‌వుతాయి. వీటిని గాలి త‌గ‌ల‌కుండా మూత ఉండే గాజు సీసాలో నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 10 నుండి 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ రాగి ల‌డ్డూల‌ను రోజుకి ఒక‌టి లేదా రెండు చొప్పున తిన‌డం వ‌ల్ల రాగుల్లో ఉండే పోష‌కాలు మ‌న శ‌రీరానికి ల‌భిస్తాయి. దీంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Tags: ragi laddu
Previous Post

అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన టెక్నో స్పార్క్ 9 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

Next Post

ఎన్నో ఏళ్లు వ‌చ్చినా వివాహం ఇంకా కావ‌డం లేదా ? అయితే ఇలా చేయండి..!

Sahithi

Sahithi

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

by Shreyan Ch
January 16, 2024

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

29 రోజుల్లో పూర్తైన చిరంజీవి సినిమా.. ఏకంగా 500 రోజులు ఆడింది.. ఆ మూవీ ఏదంటే..?

by Shreyan Ch
February 24, 2023

...

Read moreDetails
వార్త‌లు

Chitram Bhalare Vichitram : చిత్రం భ‌ళారే విచిత్రం మూవీకి చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

by editor
May 12, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.