Raghurama Krishnam Raju : వైఎస్ వివేకా హత్య కేసు ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు పుట్టిస్తుంది. ఆయన చనిపోయి చాలా రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆయన మరణం వెనక మిస్టరీ ఏంటనేది బయటకు రావడం లేదు. ఇటీవల వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన కూతురు సునీత సంచలన విషయాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ భార్య వైఎస్ భారతి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్లను ఆమె ప్రస్తావించడం సంచలనం రేపుతోంది. తన ఇంటికొచ్చి కలుస్తానంటూ 2019 మార్చి 22న వైఎస్ భారతి తనకు ఫోన్ చేశారని… తాను కడప, సైబరాబాద్ కమిషనరేట్లకు వెళ్లాల్సి ఉందని భారతికి చెప్పానని సునీత తెలిపారు.
ఎక్కువ సమయం తీసుకోనని చెప్పిన భారతి వెంటనే తన ఇంటికి వచ్చారని చెప్పారు. అయితే ఆమెతో పాటు విజయమ్మ, వైఎస్ అనిల్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రావడంతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. లిఫ్ట్ వద్దే భారతితో తాను మాట్లాడానని, ఆ సమయంలో భారతి చాలా ఆందోళనగా కనిపించారని చెప్పారు. ఇక వివేక హత్య కేసు లో సీబీఐ ఛార్జిషీట్‌లో అనేక అంశాలు ఉన్నాయని, ఈ కేసులో సీబీఐ చేతులు ఎత్తేశారాని సాక్షిలో రాసుకున్నారని, ఐ ఏమో ఓ యాప్ ద్వారా మెసేజ్ చేసినట్టు ఉందని క్లియర్‌గా అందులో రాశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు.
![Raghurama Krishnam Raju : వివేకా హత్యపై రఘురామకృష్ణంరాజు సంచలన కామెంట్స్.. భారతీ రెడ్డి వాట్సాప్ చాట్ బయటపెట్టేశాడుగా..! Raghurama Krishnam Raju revealed bharati reddy whatsapp chat](http://3.0.182.119/wp-content/uploads/2023/07/raghurama-krishnam-raju.jpg)
వివేకానంద రెడ్డితో రాయించిన లేఖ ముందు ఎవరు పెట్టారో దాని వేలిముద్రలు కూడా ఉంటాయని, వాటిపై సీబీఐ ఇప్పటికే ఆధారాలు సేకరిస్తున్నారన్నారు. వివేకా హత్య ఆస్తి కోసం కాదని.., కేవలం రాజకీయ హత్య అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. లోకేష్ కు హక్కు ఉందని, ఆయన అడగవచ్చునని.. ఎందుకంటే వారి కుటుంబం నారసురా రక్త చరిత్ర అని వైసీపీ వాళ్ళు వేశారన్నారు. అవినాష్ రెడ్డి 6.30 గంటలకు జగన్ పీఏకు ఫోన్ చేసి వివేకానంద రెడ్డి చనిపోయారని చెపితే… సాక్షిలో గుండెపోటు కథనాలు ఎందుకు వచ్చాయి?.. విజయసాయిరెడ్డి ఏడుపు మొఖం పెట్టి వివేక గుండెపోటుతో చనిపోయారని ఎలా చెప్పారని ప్రశ్నించారు. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేశారు. అలానే తాను కొన్ని పత్రాలు చూపించి ప్రశ్నల వర్షం కురిపించాడు.