Raghurama Krishnam Raju : ప్రస్తుతం ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు. అయితే ఏపీలో పవన్ కళ్యాణ్, జగన్ ఇద్దరి మధ్య రచ్చ ఎంత చర్చనీయాంశంగా మారుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రచార కార్యక్రమంలో జగన్‌పై పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు విసురుతుండగా, మరోవైపు ఆయనకి సపోర్ట్‌గా పలువురు నిలుస్తున్నారు..మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురవుతుండడంతో ఆయన ప్రచారానికి బ్రేక్ పడుతూ వస్తుంది. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించి తీరుతారని ఆయనను ఏ శక్తి అడ్డుకోలేదని ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. టిడిపి నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నేడు పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిశారు.
పవన్ కళ్యాణ్ తో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సరళిపై ఆయన మాట్లాడారు. అయితే ఇది మర్యాదపూర్వకమైన భేటీ అని రఘురామ కృష్ణంరాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ భేటీ పై మాట్లాడిన ఆయన అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దుర్మార్గపు శక్తుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఇదే సమయంలో తనకు పవన్ కళ్యాణ్ తోనూ, నాగబాబు తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా తనకోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.
![Raghurama Krishnam Raju : రఘురామ మాటలకి పడిపడి నవ్వుకున్న పవన్ కళ్యాణ్.. అంతలా ఏం మాట్లాడారంటే..! Raghurama Krishnam Raju funny comments pawan kalyan laughed very much](http://3.0.182.119/wp-content/uploads/2024/04/raghu-rama-krishnam-raju.jpg)
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయంపై రఘురామ వ్యాఖ్యలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని, ఏకంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ తిష్ట వేసినా పవన్ కళ్యాణ్ విజయం ఆగదని స్పష్టం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు 65 వేల ఓట్ల మెజారిటీ గ్యారెంటీ అని రఘురామ కృష్ణంరాజు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.