Radhika Merchant : అనంత్ అంబానీ – రాధిక మర్చంట్‌ల పెళ్లి గురించి దేశమంతా చర్చ. వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకకు ప్రపంచ దిగ్గజాలు సైతం ప్రత్యేక విమానాల్లో ఇండియాకు తరలివచ్చారు. అనంత్, రాధిక.. చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులు. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.. ఆ స్నేహం కాస్తా.. ప్రేమగా మారి.. పెళ్లి వరకు దారితీసింది. అంబానీ కోడలు రాధిక మర్చంట్ డిసెంబర్ 18, 1994న జన్మించారు. యువ వ్యాపారవేత్త, భరతనాట్యం నృత్యకారిణి. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ వైరెన్ మర్చంట్ CEO మరియు ఎన్‌కోర్ హెల్త్‌కేర్ డైరెక్టర్ శైలా మర్చంట్ కుమార్తె. రాధికకు తన సోదరి అంజలి మర్చంట్‌తో విపరీతమైన అనుబంధం ఉంది.
ఆమె కేథడ్రల్ జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మొండియల్ వరల్డ్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఆమె బీడీ సోమాని ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ఇంటర్నేషనల్ బాకలారియేట్ డిప్లొమాతో న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉంది. చదువుతో పాటు.. ముంబైలోని శ్రీ నిభా ఆర్ట్స్ డ్యాన్స్ అకాడమీలో గురు భావన థాకర్ మార్గదర్శకత్వంలో ఎనిమిదేళ్ల పాటు భరతనాట్యంలో శిక్షణతో పాటు సాంప్రదాయ నృత్యంలో శిక్షణ పొందింది. అయితే ఆమె ప్రీ వెడ్డింగ్ వేడుకలో మాట్లాడిన మాటలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అనంత్ మాట్లాడిన తర్వాత అంబానీ ఫ్యామిలీకి కాబోయే కోడలు రాధికా మర్చంట్ కూడా మాట్లాడింది. చేతిలో ఎలాంటి నోట్ లేకుండా ఆమె అనర్గళంగా అనంత్ గురించి ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆహా అనిపించాయి. కానీ, ఆమె మాట్లాడిన మాటలు ఓ హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టారంటూ ఓ నెటిజన్ వీడియో షేర్ చేశాడు. 2004లో వచ్చిన హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టారని కామెంట్ చేశాడు. ‘షెల్ వియ్ డ్యాన్స్’ అనే సినిమాలో సుసాన్ సారండన్ మాట్లాడిన మాటలనే ప్రీ వెడ్డింగ్ వేడుకలో రాధిక చెప్పినట్లు వివరించాడు. ఇద్దరి మాటలు ఒకేలా ఉండటంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…