Rachin Ravindra : వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై అద్భుతమైన సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించారు రచిన్ రవీంద్ర.భారత సంతతికి చెందిన ఇతనికి సంబంధించి ఇప్పుడు నెట్టింట తెగ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. రచిన్ తండ్రికి క్రికెట్ అంటే ఇష్టం. ఇక మాజీ లెజెండరీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ అంటే మరీ మరీ ఇష్టం. దీంతో తన కుమారుడికి ఆ ఇద్దరు క్రికెటర్ల పేర్లు వచ్చేలా నామకరణం చేశాడని కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి.అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో బేజ్ బాల్ ఆటతో.. 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.2 ఓవర్లలోనే చేధించింది. డెవాన్ కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్), రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్) దుమ్ము రేపే ఆటతో చెలరేగడంతో 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
బ్యాటింగ్ ఆర్డర్‌లో అనూహ్యంగా ప్రమోషన్ అందుకున్న రచిన్ రవీంద్ర.. ఇంగ్లండ్ జట్టుకు చుక్కలు చూపాడు. బౌలర్ ఎవరైనా సరే తగ్గేదే లే అన్నట్టు విధ్వంసం సృష్టించాడు. అతనికి భారత్‌తో ఉన్న సంబంధం ఏంటనే విషయంపై నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర.. న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 23 ఏళ్ల రచిన్ రవీంద్ర ఇప్పుడు న్యూజిలాండ్ తరఫున ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. డెవాన్ కాన్వే రెండో స్థానానికి, మార్టిన్ గప్టిల్ మూడో స్థానానికి పడిపోయారు.
23 ఏళ్ల రచిన్ రవీంద్ర ఇప్పుడు న్యూజిలాండ్ తరఫున ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు 18 టీ20లు, 13 వన్డే మ్యాచ్‌లు ఆడిన రచిన్ రవీంద్ర 26 వికెట్లు తీసాడు. బ్యాటింగ్‌లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అలాంటి రచిన్ రవీంద్ర ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన శతకంతో కదం తొక్కి అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు. రచిన్ రవీంద్ర అనంతపురంలో శిక్షణ పొందాడు. రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి బెంగళూరులో ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడు. క్లబ్ క్రికెట్ ఆడుతూనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేశారాయన. భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్.. రవి కృష్ణమూర్తికి స్నేహితుడు. న్యూజిలాండ్ వెళ్లాక కూడా క్రికెట్‌పై ఇష్టంతో ‘ది హట్ హాక్స్’ అనే క్రికెట్ క్లబ్‌ను స్థాపించాడు.