Pushpa Movie Mistakes : స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా అన్ని భాషలలో విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించిన విషయం విదితమే. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. సునీల్, అనసూయ, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాలో అన్ని పాత్రలకి నటీనటులు అందరూ న్యాయం చేశారు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర తర్వాత హైలైట్ అయిన పాత్ర కేశవ అనే చెప్పాలి.
ఇటీవల విడుదలైన చిత్రాలలో దర్శకులు కొన్ని పొరపాట్లు చేస్తుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. అలా పుష్పలో సుమారు 20 తప్పులు ఉన్నాయి. సినిమా మొదలైంది మనకు జపాన్‌లోని ఓ సంగీత వాద్య పరికరం చూపించి. దానిని ఎర్రచందనంతో చేస్తారని… అది చాలా గొప్పదని. అయితే ఈ క్రమంలో ఆ వస్తువు ధర రూ.8 లక్షలు అని సినిమాలో చెబుతారు. అయితే ఆ వస్తువు మీద జపాన్ కరెన్సీలో 12,500 అని ఉంటుంది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 8వేలే. ఇక సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రన్స్‌లో అతని లారీ ముందు ఓ బైక్ కనిపిస్తుంది. ఆ తర్వాతి షాట్‌లో బైక్ ఉండదు. అలాగే లారీ యాంగిల్ కూడా పూర్తిగా మారిపోతుంది.
ఫైట్ స్టార్ట్ అయినప్పుడు చుట్టూరా వాతావరణం వేకువజామున ఉన్నట్లు ఉంటుంది. లారీ లైట్స్ ఆన్ అయ్యి ఉంటాయి. హీరోను ఫోకస్ చేయగానే లారీ లైట్స్ దెబ్బకు ఆగిపోతాయి. హీరో ఉదయం వెలుతురులో ఉంటాడు. ఫైట్ అయిపోగానే తిరిగి మళ్లీ వేకువజామున లైటింగ్ వచ్చేస్తుంది. ఎర్రచందనం కొట్టడానికి అడవిలోకి దిగినప్పుడు వాతావరణం మొత్తం వెలుతురు, ఎండతో నిండిపోయి ఉండడం కనిపిస్తుంది.. అయితే హీరో బస్సు దిగగానే వర్షం స్టార్ట్ అవుతుంది. గోవిందప్ప నుండి తప్పించుకోవడానికి లారీని బావిలో పడేలా చేస్తాడు పుష్ప.
అయితే అంత పెద్ద లారీ నీటిలో అంత వేగంగా మునిగిపోతుందా, రెండోది శబ్దం రాదా అనేది అందరిలో ఓ డౌట్ . చిన్నప్పటి పుష్ప రాజ్ స్కూలు వెళ్లే సమయంలో పరిగెడుతూ ఉంటాడు. అంతకుముందు షాట్‌లో ఆ రోడ్డు మీద స్కూటర్ ఉండదు. అలాగే ఓ సైకిల్ ఉంటుంది. కానీ షాట్ యాంగిల్ మార్చేసరికి స్కూటర్ వస్తుంది, సైకిల్ వెళ్లిపోతుంది. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…