Pushpa Jagadeesh : పుష్ప జ‌గ‌దీష్ అలాంటి వాడా.. గుట్టు ర‌ట్టు కావ‌డంతో ఆయ‌న కెరీర్ ఖ‌త‌మైన‌ట్టేనా..?

Pushpa Jagadeesh : సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన పుష్ప చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇందులో న‌టించిన వారంద‌రికి మంచి పేరు వ‌చ్చింది. ముఖ్యంగా ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌కి స్నేహితుడిగా కేశవ పాత్రలో జగదీష్ న‌టించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నాడు. అయితే మహిళ ఆత్మహత్య కేసులో సినీ నటుడు జగదీష్ ప్రతాప్ బండారిని హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తోన్న ఒక మహిళ.. మరో వ్యక్తితో ఏకాంతంగా ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని జగదీష్ బెదిరించినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో జగదీష్‌పై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు బుధవారం అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది.

కాకినాడకు చెందిన ఆ మహిళకు ఆరేళ్ళ క్రిందట వివాహం జరిగింది. అయితే కొంత కాలానికే విభేదాలతో విడిపోయారు. ఆ తరువాత హైదరాబాద్ వచ్చిన ఆ మహిళ సోమాజిగూడలోని ఒక అపార్ట్మెంట్ లో నివసిస్తూ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. ఈక్రమంలోనే జగదీశ్ తో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొంత కాలం కలిసి కూడా జీవించారు. ఆమె జగదీశ్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ జగదీశ్ ఇంతలో మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ మహిళ జగదీశ్ ని దూరం పెట్టింది. కానీ జగదీశ్ మాత్రం ఆమె వెంట పడుతూనే వచ్చాడు. ఈమద్యలో ఆ మహిళ మరొక వ్యక్తితో బంధం ఏర్పరుచుకుంది. నవంబర్ 27వ తేదీ రాత్రి ఆ మహిళ తన అపార్ట్మెంట్ లో ఆ వ్యక్తితో అర్దనగ్నంగా ఉన్న సమయంలో జగదీశ్.. వారిని కిటికీ నుంచి ఫోటోలు తీశారు. అయితే కిటికీ చప్పుడు రావడంతో ఆ మహిళ, వ్యక్తి.. జగదీశ్ ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pushpa Jagadeesh facing big trouble his career is over
Pushpa Jagadeesh

జగదీశ్ తాను తీసిన ఫోటోలను చూపించి వారిని భయపెట్టడానికి ప్రయత్నించాడు. మహిళతో ఉన్న వ్యక్తి పోలీసులకి చెబుతాం అని అనడంతో జగదీశ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే జగదీశ్ మాత్రం ఆ ఫోటోలను ఆ మహిళకి పంపించి.. తనకి సహకరించకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేస్తా అని బెదిరించాడట. దీంతో ఏం చేయాలో తెలియక ఆ మహిళ 29న తన ఫ్లాట్ లో ఉరి వేసుకొని మరణించింది. అయితే ఆ మ‌హిళ మృతికి ప్ర‌ధాన కార‌ణం జ‌గ‌దీష్ అని తెలిసి అంద‌రు అత‌నిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పుష్ప‌2లో అత‌ను భాగం కాగా, ఆయ‌న‌ని త‌ప్పించాల‌ని కొంద‌రు డిమాండ్ కూడా చేస్తున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago