Pushpa Jagadeesh : సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో నటించిన వారందరికి మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌కి స్నేహితుడిగా కేశవ పాత్రలో జగదీష్ నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే మహిళ ఆత్మహత్య కేసులో సినీ నటుడు జగదీష్ ప్రతాప్ బండారిని హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తోన్న ఒక మహిళ.. మరో వ్యక్తితో ఏకాంతంగా ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని జగదీష్ బెదిరించినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో జగదీష్‌పై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు బుధవారం అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది.
కాకినాడకు చెందిన ఆ మహిళకు ఆరేళ్ళ క్రిందట వివాహం జరిగింది. అయితే కొంత కాలానికే విభేదాలతో విడిపోయారు. ఆ తరువాత హైదరాబాద్ వచ్చిన ఆ మహిళ సోమాజిగూడలోని ఒక అపార్ట్మెంట్ లో నివసిస్తూ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. ఈక్రమంలోనే జగదీశ్ తో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొంత కాలం కలిసి కూడా జీవించారు. ఆమె జగదీశ్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ జగదీశ్ ఇంతలో మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ మహిళ జగదీశ్ ని దూరం పెట్టింది. కానీ జగదీశ్ మాత్రం ఆమె వెంట పడుతూనే వచ్చాడు. ఈమద్యలో ఆ మహిళ మరొక వ్యక్తితో బంధం ఏర్పరుచుకుంది. నవంబర్ 27వ తేదీ రాత్రి ఆ మహిళ తన అపార్ట్మెంట్ లో ఆ వ్యక్తితో అర్దనగ్నంగా ఉన్న సమయంలో జగదీశ్.. వారిని కిటికీ నుంచి ఫోటోలు తీశారు. అయితే కిటికీ చప్పుడు రావడంతో ఆ మహిళ, వ్యక్తి.. జగదీశ్ ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
![Pushpa Jagadeesh : పుష్ప జగదీష్ అలాంటి వాడా.. గుట్టు రట్టు కావడంతో ఆయన కెరీర్ ఖతమైనట్టేనా..? Pushpa Jagadeesh facing big trouble his career is over](http://3.0.182.119/wp-content/uploads/2023/12/pushpa-jagadeesh.jpg)
జగదీశ్ తాను తీసిన ఫోటోలను చూపించి వారిని భయపెట్టడానికి ప్రయత్నించాడు. మహిళతో ఉన్న వ్యక్తి పోలీసులకి చెబుతాం అని అనడంతో జగదీశ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే జగదీశ్ మాత్రం ఆ ఫోటోలను ఆ మహిళకి పంపించి.. తనకి సహకరించకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేస్తా అని బెదిరించాడట. దీంతో ఏం చేయాలో తెలియక ఆ మహిళ 29న తన ఫ్లాట్ లో ఉరి వేసుకొని మరణించింది. అయితే ఆ మహిళ మృతికి ప్రధాన కారణం జగదీష్ అని తెలిసి అందరు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప2లో అతను భాగం కాగా, ఆయనని తప్పించాలని కొందరు డిమాండ్ కూడా చేస్తున్నారు.