కొన్నాళ్లుగా సరైన సక్సెస్‌లు లేక ఇబ్బంది పడుతున్నాడు పూరీ జగన్నాథ్. మధ్యలో ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, రీసెంట్‌గా వచ్చిన లైగర్ చిత్రం దారుణంగా నిరాశపరచింది. దారుణమైన వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంతా కలిసి పూరి జగన్నాథ్ ఆఫీస్ ముందు ధర్నా చేద్దామని ప్రయత్నాలు చేయడం అందరికీ తెలిసిందే. ఈ మేరకు వాట్సప్ స్క్రీన్ షాట్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చినప్పటికీ పూరీ జగన్నాథ్ మాట నిలబెట్టుకోకపోవడంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు పూరిపై కత్తి ఎక్కబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలో పూరీ జగన్నాథ్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో వరంగల్ శీను , ఫైనాన్షియర్ శోభన్‌లపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అందరినీ హింసకు ప్రేరేపించి.. నాకుటుంబాన్ని శారీరకంగా, మానసికంగా, బ్లాక్ మెయిల్ ద్వారా భయపెట్టి తన నుంచి అక్రమంగా డబ్బు తీసుకోవాలని చూస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు పూరి. వారి నుంచి తన కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా పూరి తన ఫిర్యాదులో తెలియజేశాడు. అయితే పూరీ ఒకవైపు నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఛార్మీ నోటి దూల వలన పూరీకి మరిన్ని చిక్కులు వచ్చిపడేలా కనిపిస్తున్నాయట.
ఒక పార్టీలో ఛార్మి లైగర్ బిజినెస్ గురించి ఒక పార్టీలో షాకింగ్ ఫాక్ట్స్ రివీల్ చేసిందట. అంతా అనుకున్నట్లు లైగర్ వల్ల తమకేమీ నష్టాలు రాలేదు అని.. థియేట్రీకల్ బిజినెస్, నా థియేట్రికల్ బిజినెస్ వల్ల తమకి కొన్ని కోట్ల లాభం వచ్చింది అని తెలిపిందట. ఈ విషయం అంతటా వైరల్ కావడంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు పూరిపై మరింత ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పూరీ ఫ్యాన్స్.. ఛార్మీని తెగ తిట్టిపోస్తున్నారట.