Prudhvi Raj : ఏపీలో ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.ఏదో ఒక అంశంలో దారుణంగా విమర్శించుకుంటున్నారు. అయితే వైసీపీ నుండి బయటకు వచ్చి జనసేనలో చేరిన పృథ్వీరాజ్ రీసెంట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు.. రోజాకు అహంకారం ఎక్కు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకుల నోర్లు ఫినాయిల్‌తో కడిగిన మారవని, మంచి మాట్లాడిన చెడుగా అర్థం చేసుకుంటారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాల్లో టీడీపీ – జనసేన కూటమి అద్భుతమైన విజయం సాధిస్తుందని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు.
విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగిన సభ ప్రభుత్వం ప్రమాణ స్వీకార సభల మారిందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాట ప్రజలకు చేరువైందన్నారు. వైసీపీ నాయకుల నోర్లు ఫినాయిల్‌తో కడిగిన మారవని, మంచి మాట్లాడిన చెడుగా అర్థం చేసుకుంటారని విమర్శించారు. “నిజంగా 175కు 175 సీట్లు వైసీపీకి వచ్చే పరిస్థితి ఉంటే 92 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు ఎందుకోసం అని పృథ్వీరాజ్ ప్రశ్నించారు.. వచ్చే ఎన్నికలతో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. బలిజ ఐక్యత ఎలా ఉంటుందో రానున్న ఎన్నికల ఫలితాలతో నిరూపితం అవుతుంది. అధికార పార్టీ నాయకులు ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన కవ్వింపులకు దిగినా ఆవేశాలకు లోను కావద్దు.
వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నా నేను సిద్ధంగా ఉన్నా. అంబటి రాంబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే జబర్దస్త్ షోలకు పనికి వస్తాడు. రోజాకు అహంకారం ఎక్కువ. ఎన్నికల నోటిఫికేషన్ రావడమే ఆలస్యం అధికార పార్టీ నుంచి జంపింగ్‌లు ఎక్కువగా ఉంటాయి.” అని పృథ్వీరాజ్ జోస్యం చెప్పారు.కాగా, జగన్ పాదయాత్రలో సినీ నటుడు పృథ్వీరాజ్ మద్దతుగా నిలిచారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఆయనకు ఎస్వీబీసీ ఛైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో వచ్చిన ఆరోపణలతో ఆయన్ను తప్పించారు. తరువాతి కాలంలో పృథ్వీరాజ్ జనసేనలో చేరారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దమని..తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…