Priyamani : టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు అవుతుంది. 2003లో విడుదలైన ఎవరే అతగాడు ఆమె మొదటి చిత్రం. సుదీర్ఘ కెరీర్లో అనేక విలక్షణ పాత్రలు చేసింది. పరుత్తివీరన్ చిత్రానికి నేషనల్ అవార్డు అందుకుంది. హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయ్యాక కూడా ఆమె కెరీర్ సజావుగానే సాగుతుంది. వెబ్ సిరీస్లు, చిత్రాల్లో లీడ్ రోల్స్ లో కనిపిస్తున్నారు. ప్రియమణి తాజాగా భామాకలాపం 2లో నటించారు. ఆహా లో ఫిబ్రవరి 16 నుండి ఇది స్ట్రీమ్ అవుతుంది. భామాకలాపం ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ ప్రెస్ మీట్ లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. 2003 నుంచి 2024 వరకు మీ గ్లామర్ ని అలాగే మైంటైన్ చేస్తున్నారు, దాని వెనుక సీక్రెట్ ఏంటి? అని రిపోర్టర్ అడగ్గా, అందుకు ప్రియమణి బదులిస్తూ..” హ్యాపీ పీపుల్ తో ఎక్కువగా కలవడం, ఆహ్లాదకరమైన వాతావరణం లో ఉండడం, పాజిటివ్ వైబ్స్.. ఇవే నా గ్లామర్ సీక్రెట్” అని చెప్పింది. ” నేను భర్తకు భయపడతాను, అదే సమయంలో భయపెడతాను. అంటే వైలెన్స్ అని కాదు. కొన్ని సందర్భాల్లో భర్త మన మాట వినాలి, మనం కొన్నిసార్లు వాళ్ళ మాట వినాలి. ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నమాట. అయినా భార్య భర్త అన్నాక గొడవలు సాధారణం” అని ప్రియమణి చెప్పుకొచ్చింది.
ప్రియమణి 2017లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మొదటి భార్యతో విడిపోయిన ముస్తఫా రాజ్ ప్రియమణిని చేసుకున్నాడు. ముస్తఫా రాజ్ ఫస్ట్ వైఫ్ ఇప్పటికీ ఆరోపణలు చేస్తుంది. ప్రియమణితో ముస్తఫా వివాహం చెల్లదని అంటుంది. వృత్తి రీత్యా ముస్తఫా రాజ్ ఎక్కువగా అమెరికాలోఉంటూ వస్తున్నారు. ఇక ప్రియమణి ఇక్కడ సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్లు చేస్తూ బిజిబిజీగా గడుపుతుంది. ఒకప్పుడు పెళ్లయిన తర్వాత హీరోయిన్లు ఫిలిం కెరీర్ కన్నా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్లి అయినా అవ్వకపోయినా ఇండస్ట్రీ, ఆడియన్స్ లవ్ అండ్ సపోర్ట్ ఇప్పటికీ అలాగే ఉంది.అంటూ చెప్పింది.