Prashanth Kishore : మరి కొద్ది నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రంజుగా సాగుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులతో అధికార విపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్న నేపథ్యంలో వైసీపీని తరిమి కొట్టేందుకు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుగుదేశం, జనసేన ప్రకటించాయి. దీనికి సంబంధించి సీట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యాచరణ సహా అనేక అంశాలపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పలుసార్లు భేటీ కూడా అయ్యారు. అయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. చంద్రబాబు నాయుడి నివాసంలో ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వారిద్దరి భేటి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ టీమ్.. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీకి సపోర్ట్‌గా పనిచేస్తుండగా.. ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ కావడం కీలకంగా మారింది. అయితే సీనియర్ పొలిటికల్ లీడర్ కావటంతోనే చంద్రబాబుతో భేటీ అయినట్లు ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యం లేదని పీకే తెలిపారు. అనంతరం ఐప్యాక్ టీమ్ సైతం ఇదే తరహాలో ట్వీట్ చేసింది. జగన్ మరోసారి అధికారంలోకి రావడం కోసం తాము ఏడాది కాలంగా వైఎస్సార్సీపీ తరఫున పని చేస్తున్నట్లు ఐప్యాక్ వెల్లడించింది.
ఏడాది కాలంగా వైఎస్సార్సీపీతో ఐప్యాక్ కలిసి పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు జగన్ తిరుగులేని ప్రయత్నం చేస్తున్నారు. 2024లో మరోసారి జగన్ ఘన విజయం సాధించేంత వరకు అవిశ్రాంతంగా పనిచేసేందుకు మేం అంకితమయ్యాం” అని ఐప్యాక్ టీమ్ ట్వీట్ చేసింది. చంద్రబాబు, లోకేష్, పీకే మధ్య దాదాపు 3 గంటల పాటు జరిగిన సుదీర్ఘ మంతనాల్లో కీలక విషయాలు చర్చించినట్లు సమాచారం. ఏపీలో తాను నిర్వహించిన సర్వే నివేదికలను చంద్రబాబు ముందు ప్రశాంత్ కిషోర్ ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్, లోకేష్‌తో పాటు.. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కోసం కలిసి పనిచేస్తున్న టీమ్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…