Prashant Kishore : జ‌గ‌న్‌ని క‌డిగిపారేసిన ప్ర‌శాంత్ కిషోర్..ఇది పెద్ద దెబ్బేనా..!

Prashant Kishore : గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ, ఎంఎల్ఏల‌తో పాటు సీఎం జ‌గ‌న్ కూడా ప్ర‌త్య‌ర్ధుల‌ని త‌మ మాట‌ల తూటాల‌తో వ‌ణికిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అన్ని రాష్ట్రాలు ఏపీని చూసి బుద్ధి తెచ్చుకోవాలంటూ ప్రశాంత్ కిషోర్ మాట మార్చారు. జగన్‌లా పారిపాలన చేస్తే అడుక్కు తినాల్సిందేన‌ని అన్నారు. అభివృద్ధి చేయకుండా, డబ్బు సంపాదించకుండా పంచుకుంటూ పోతే ఏపీ లాంటి పరిస్థితులే వస్తాయని పీకే అన్నారు. ఇప్పుడు ఆయ‌న‌ చేసిన వ్యాఖ్యలు జగన్‌కు చెంపదెబ్బలాంటిదని చెప్పవచ్చు. జగన్ పాలన చూసి సిగ్గుపడుతున్నట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏపీలో కేవలం సంక్షేమ పధకాలు మాత్రమే కనిపిస్తాయి. వినిపిస్తాయి. కానీ తెలంగాణలో సంక్షేమ పధకాలతో పాటు అభివృద్ధి కూడా కళ్లెదుట స్పష్టంగా కనిపిస్తుంది. సంక్షేమ పధకాలతోనే ఏపీలో 98 శాతం పేదల జీవితాలను మార్చేశామని జగన్, మంత్రులు గొప్పగా, గర్వంగా చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వమూ చేయలేని పని వైసీపి ప్రభుత్వం కేవలం నాలుగున్నరేళ్ళలో చేసేయడం నిజమైతే, నిజంగా అభినందించాల్సిందే! ఇదే సంక్షేమ విధానాన్ని యావత్ దేశం, యావన్ ప్రపంచంలో అమలుచేస్తే సరిపోతుంది కదా ?

Prashant Kishore serious comments on cm ys jagan
Prashant Kishore

ఒకవేళ సంక్షేమ పధకాలతోనే ఆంద్రాలో పేదల జీవితాలలో మార్పు వచ్చేసి, పేదరికం తొలిగిపోయి ఉంటే ఇకపై వాటిని కొనసాగించనవసరం లేదు కదా?కానీ వైసీపినే మళ్ళీ గెలిపిస్తే భవిష్యత్‌లో కూడా మరిన్ని సంక్షేమ పధకాలను కొనసాగిస్తామని జగన్, మంత్రులు స్వయంగా చెప్పుకొంటున్నారు. అంటే వాటితో పేదల జీవితాలలో ఎటువంటి మార్పు రాలేదనే కదా అర్ధం? అని ప్ర‌శాంత్ కిషోర్ అన్నారు. సంపద సృష్టించే వాతావరణాన్ని సమాజంలో కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. సంపద సృష్టికి ప్రభుత్వాలే సహకరించకపోతే పంచడానికి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందని.. అపరిమితంగా అప్పులు చేసే పరిస్థితికి దారి తీస్తుంది. జగన్‌ ప్రభుత్వానికి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్.. దేశంలో ఏ రాష్ట్రమైన అభివృద్ధిని పట్టించుకోకుండా, కేవలం సంక్షేమ పధకాలను మాత్రమే అమలుచేస్తుంటే చివరికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలాగ దివాళా తీస్తాయని కుండ బద్దలు కొట్టడం చ‌ర్చనీయాంశ‌మైంది.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago