Prashant Kishore : ఆ పార్టీ చిత్తుగా ఓడిపోతుంది అంటూ ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న కామెంట్స్

Prashant Kishore : ఈ సారి ఏపీ ఎన్నిక‌లు ఎంత ర‌చ్చ‌గా మారాయో చూశాం. ఎవ‌రు గెలుస్తారు అనే దానిపై ఇప్పుడు జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అయితే వీటిపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. మరోసారి స్పందించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమి తప్పదు అని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ఓట్ల లెక్కింపులో ఓ నాలుగు రౌండ్లు పూర్తయ్యాక.. ఆధిక్యం రాకపోతే ఓడిపోతున్నట్లు ఒప్పుకుంటారనీ.. కానీ.. ఎన్నికల ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిన వారిని తాను ఇంతవరకూ చూడలేదు అని వైసీపీని ఉద్దేశించి ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. బీజేపీకి 2019లో వచ్చిన సీట్లకు సమానంగా కానీ లేదా.. అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.

టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు చెబుతుంటే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2019 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వైఎస్సార్‌సీపీ సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. 151కిపైగా ఎమ్మెల్యేసీట్లు.. 22 వరకు ఎంపీ సీట్లు ఖాయమన్నారు. అంతేకాదు వైఎస్సార్‌సీపీ నేతలు ఏకంగా జూన్ 9న సీఎం జగన్ రెండోసారి సీఎం కావడం పక్కా అంటున్నారు. అయితే జగన్ ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టాపిక్ తీసుకొచ్చారు. ఏపీ ఎన్నికల ఫలితాలు గతంలో ప్రశాంత్ కిషోర్ సాధించిన వాటికన్నా ఎక్కువగా ఉంటాయన్నారు.

Prashant Kishore sensational comments on winning party
Prashant Kishore

సీఎం జగన్ వ్యాఖ్యల తర్వాత మరోసారి ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఘోర పరాజయం ఎదురు కాబోతోందని జోస్యం చెప్పారు. ఓ ప్రముఖ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నట్లు సీఎం జగన్‌మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగానే అటు అమిత్ షా, రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ కూడా చెబుతున్నారన్నారు. తాను గత పదేళ్లు ఎన్నికల్లో పనిచేస్తున్నానని.. తనకు ఫలితాల ముందే ఓటమిని అంగీకరించినవారు ఎవరూ కనిపించలేదని వ్యాఖ్యానించారు. 2019లో బీజేపీ సాధించిన 303 సీట్లకు దగ్గరగా కానీ, దానిని స్వల్పంగా అధిగమించే అవకాశాలు కానీ ఈసారి ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago