Prajavani : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఒక వేదికను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా దర్భార్ ను ఏర్పాటు చేశారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ రోజు శుక్రవారం కావడంతో ప్రజావాణి కార్యక్రమానికి సామాన్యుల నుంచి భారీ స్పందన లభించింది.
హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతి రావ్ ఫులే ప్రజాభవన్‌కు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఉదయం 10 గంటల వరకూ వచ్చిన వారికి మాత్రమే అర్జీలు ఇచ్చేందుకు అవకాశం ఉండటంతో ముందుగా బేగంపేటకు ప్రజాభవన్ కు చేరుకున్నారు.ప్రజావాణికి అద్భుతమైన స్పందన లభిస్తున్నందున ఫిర్యాదుల స్వీకరణకు టేబుళ్ల సంఖ్యను పెంచాలని, సందర్శకులకు రక్షిత మంచినీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజావాణిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ట్రైనీ ఐఏఎస్ అధికారుల సేవలను కూడా వినియోగించుకోవాలని సీఎం సూచించారు.
![Prajavani : ప్రజావాణికి సూపర్బ్ రెస్పాన్స్.. వచ్చిన వాళ్లందరు కేసీఆర్‌ని అంత తిడుతున్నారేంటి..? Prajavani got wonderful response but people not happy with kcr](http://3.0.182.119/wp-content/uploads/2023/12/prajavani.jpg)
అయితే ప్రజావాణికి వచ్చిన వారందరు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని తిట్టడం మనకు కనిపించింది. పిల్లలతో కలిసి అక్కడికి రావడం, వాళ్ల అర్జీలు చెప్పుకోవడం కనిపించింది. అయితే తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున రావడంతో తీవ్ర ట్రాఫిక్ ఏర్పాడింది. ప్రజాభవన్ వద్ద ఎలాంటి వాహనాలు నిలిపేందుకు అవకాశం ఇవ్వకుండా ముందుకు పంపుతూ ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. తమకు రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, పెన్షన్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని అధిక సంఖ్యలో వినతులు ఇస్తున్నారు.