ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించి ఆ తర్వాత సీరియల్స్‌కి వచ్చిన ప్రగతి అనంతరం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తనదైన సహజ నటనతో అమ్మ, అత్త పాత్రలకు వన్నెతెచ్చారు. గతకొంత కాలంగా ప్రతి సినిమాలో ప్రగతి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమాని సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన ప్రగతి.. అప్పటినుంచి అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. ఈ అమ్మడు డాన్స్, ఫిట్‌నెస్ సాధన చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నానా రచ్చ చేస్తుంది. ప్రగతి వీడియోలకి ఇటీవల భారీ రెస్పాన్స్ వస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇటీవలి కాలంలో వెండితెరపై కంటే.. సోషల్ మీడియాలో ట్రోల్స్‌తో ఎక్కువగా వార్తల్లో ఉంటుది ప్రగతి . తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న ప్రగతి.. తన వ్యక్తిగత విషయాలతో పాటు పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఓ సినిమా సమయంలో వర్షంలో ఓ పాట కోసం కాస్ట్యూమ్స్ విషయంలో కాంప్రమైజ్ కావడం ఇష్టం లేక హీరోయిన్‌గా నటించడం మానేశానని తెలిపారు.ఇక చిన్నతనంలో పెళ్లి చేసుకోవడం జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అంటూ ప్రగతి తెలిపింది. ఇక భర్తతో విడిపోయిన తర్వాత చేతిలో డబ్బులు లేని సమయంలో.. ఒక నిర్మాత ఫోన్ చేసి సీరియల్‌లో నటించే అవకాశం ఇచ్చారని అన్నారు. తనకు ఓ బాబుతో పాటు ఓ పాప ఉన్నారని తెలిపారు.
భర్తతో వచ్చిన విభేదాల వల్ల తాను విడాకులు తీసుకున్నట్టు చెప్పింది ప్రగతి. పెళ్లి లైఫ్ సాఫీగా సాగేందుకు చాలా కష్టపడ్డానని కానీ కుదరలేదని, అది కుదరక డైవర్స్ తీసుకున్నట్టు చెప్పింది. ఇక కరోనా సమయంలో ప్రగతి ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డట్టు పేర్కొంది. భర్త నుండి విడిపోయిన తర్వాత నగలు అమ్మి ఓ సింగిల్ బెడ్ రూమ్ కి షిఫ్ట్ అయ్యానని చెప్పింది. అయితే తొలిసారి సీరియల్ లోనటించినప్పుడు ఇచ్చిన పదివేల చెక్‌ని ఎప్పుడు మరచిపోలేనని పేర్కొంది. ప్రగతి ప్రస్తుతం బుల్లితెరపై జడ్జిగా కూడా సందడి చేస్తుంది.