Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ హీరో అయిన కూడా చాలా ఒదిగి ఉంటారు.ఆయన భోళా మనిషి. సినిమా షూటింగ్ ఉందంటే తానొక్కరే భోజనం చేయకుండా తనతోపాటు తోటి నటీనటులకు, సెట్ లో పనిచేసే బాయ్స్ తో సహా అందరికీ తానే స్వయంగా ఇంటిదగ్గర నుంచి భోజనం తెప్పిస్తారు. ఈ విషయాన్ని ఆయనతో పని చేసిన సెలబ్స్ చాలా మంది చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు. ప్రభాస్ నిజంగా రాజు అని, రాజులాంటి మహారాజు అంటూ కొనియాడతారు. ఈనెల 22వ తేదీన అయోధ్యలో రామమందిరం ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా బాలరాముడికి ప్రాణప్రతిష్ట జరగనుంది. దీనికోసం విదేశాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అతిథులంతా అయోధ్యకు తరలిరానున్నారు.
ఇటీవల ఏపీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆ రోజు ఆహార ఖర్చులను చూసుకోవడానికి ప్రభాస్ ముందుకు వచ్చారంటూ మాట్లాడారు. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది తెలియలేదు. అందుకు కారణం కూడా ఉంది. నిజానికి రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రభాస్‌కు ఆహ్వానం అందలేదు. రజనీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్, ధనుష్‌లతో పాటు కొందరు సౌత్ సెలబ్రిటీలకు మాత్రం ఆహ్వానం అందింది. ఆహ్వానమే అందుకోని ప్రభాస్ ఆహార ఖర్చులు పెట్టుకుంటానని హామీ ఇచ్చారంటూ వచ్చిన వార్తల్లో వాస్తవమెంతో ప్రభాస్ టీమ్ మెంబర్లు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
రామమందిరం చుట్టుపక్కల కలిపి దాదాపు 300 ప్రాంతాల్లో అన్నదానం చేయనున్నారని, దీనికి ప్రభాస్ ముందుకు వచ్చారని, ఖర్చు రూ.50 కోట్లు కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే కొందరు ప్రభాస్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అతని మంచి మనసుకు, మంచి మనస్తత్వానికి ఇది నిదర్శనమంటూ పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో ఈనెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అత్యంత వైభవోపేతంగా జరగనుంది. ఇప్పటికే అయోధ్యలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని,భారీ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.