Prabhas : లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయం చేయనక్కర్లేదు. భారతీయులు గర్వపడేలా చేసిన కమల్ హాసన్ ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారు. కలెక్షన్స్ గురించి ఆలోచించకుండా ప్రేక్షకులకి వినోదం పంచాలనే ఉద్దేశంతో వైవిధ్యమైన సినిమాలు చేశాడు. ఇప్పటికీ కూడా కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నాడు. చివరిగా విక్రమ్ అనే సినిమాతో మంచి హిట్ కొట్టిన కమల్ హాసన్ ఇప్పుడు శంకర్ దర్వకత్వంలో ఇండియన్ 2 అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఊహించని విధంగా ప్రాజెక్ట్ కెలో కమల్ హాసన్ ఇప్పుడు భాగం కావడం ఇప్పుడు నేషనల్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న మరో భారీ సినిమా ప్రాజెక్ట్ కే . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.
ఇప్పటికే ఈ సినిమా 80 శాతానికిపైగా షూట్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో లేటెస్ట్‌గా లోకనాయకుడు కమల్ హాసన్ నటించనున్నారని టీమ్ అధికారికంగా ప్రకటించింది. కమల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నారట. అంతేకాదు ఈ పాత్ర కోసం దాదాపుగా 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.
కమల్ హాసన్‌తో పనిచేయడంపై స్పందించిన ప్రభాస్.. నా గుండెల్లో ఎప్పటికీ దాచుకునే ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఇది. ప్రాజెక్ట్ కేలో కమల్ హాసన్ గారితో నటించే అవకాశం దొరకడం ఒక అదృష్టంగా భావిస్తున్నా.. టైటాన్ ఆఫ్ సినిమా లాంటి నటునితో నటించడం అనేది ఒక కల.. అది ప్రాజెక్ట్ కేతో నిజం అవ్వడం ఎంతో సంతోషంగా ఉందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు గతంలో కమల్ హాసన్‌తో ప్రభాస్ స్టేజ్ షేర్ చేసుకున్న వీడియో కూడా వైరల్ అయింది. ఇందులో ప్రభాస్ తనని తాను పరిచయం చేసుకున్నాడు. సర్ నా పేరు ప్రభాస్. నేను మీకు తెలియకపోవచ్చు. మీకు నేను పెద్ద ఫ్యాన్. మీ పక్కన కూర్చోవడం అదృష్టంగా భావిస్తున్నాను అని ప్రభాస్ చెప్పుకొచ్చారు. ఆ వీడియో కూడా వైరల్ అయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…