Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో ఆయన రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోగా, ఆయన ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన సలార్ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ మూవీకి భారీ స్తాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా..ఇప్పుడు ఓటీటీ పార్టనర్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు చిత్రయూనిట్ అంతగా ప్రమోషన్స్ జరపలేదు. కేవలం రాజమౌళికి మాత్రం ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇక ఇప్పుడు సలార్ చిత్రబృందానికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
అందులో ప్రభాస్, శ్రుతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ డార్లింగ్ ఓకే.. కానీ రెబల్ స్టార్ అని ఎందుకంటారు ?.. అంటూ పృథ్వీరాజ్ సందేహం వ్యక్తం చేయగా… ఎందుకు ?.. అంటూ నేరుగా ప్రభాస్ ను అడిగేసింది శ్రుతి. ఈ మూవీ మొదలైనప్పుడు అందరూ డార్లింగ్‌తో సినిమా చేస్తున్నావా అని అడిగేవారు. అది వినీ వినీ హా అవును అంటూ ఊ కొట్టేదాన్ని.. కానీ ప్రభాస్‌ను కలిసిన వారం రోజులకే నాకు అర్థమైంది తనని ఎందుకు డార్లింగ్ అని పిలుస్తారో” అంటూ శ్రుతి హాసన్ చెప్పింది. దీనిపై పృథ్వీరాజ్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాకు ప్రభాస్‌ను రెబల్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో తెలీదు.. కానీ తనని డార్లింగ్ అని ఎందుకు అంటారో పూర్తిగా అర్థమైంది అంటూ పృథ్వీరాజ్ చెప్పాడు.
దీంతో వెంటనే శ్రుతి హాసన్.. “అవును ప్రభాస్.. నిన్ను రెబల్ స్టార్ ఎని ఎందుకంటారు” అంటూ అడిగేసింది. దీంతో మా పెద్దనాన్న రెబల్ స్టార్.. అంటూ ప్రభాస్ నవ్వుతూ బదులిచ్చాడు. హో అంటే ఆయన నుంచి మీకు ఈ పేరు వచ్చిందన్నమాట అంటూ శ్రుతి హాసన్ అంది. ఇక పృథ్వీరాజ్‌తో నాకు సీన్లు ఏమీ లేవు.. మీతో కొన్ని సీన్లు ఉన్నాయి.. అలానే మీ ఇద్దరికీ కూడా చాలా సీన్లు ఉన్నాయి” అంటూ శ్రుతి హాసన్ చెబుతుంటే ప్రభాస్ ఓ కౌంటర్ వేశాడు. అవును నీ కంటే పృథ్వీరాజ్‌తోనే ఎక్కువ సీన్లు ఉన్నాయంటూ నవ్వుకున్నాడు. అవును.. సినిమాలో రొమాన్స్ కంటే బ్రొమాన్స్‌యే ఎక్కువ ఉందంటూ శ్రుతి హాసన్ కూడా సెటైర్ వేసింది. ప్రశాంత్‌కి స్టోరీ నెరేట్ చేయడం రాదు.. కానీ తీసేటప్పుడు మాత్రం చాలా క్లారిటీగా తీస్తాడంటూ ప్రభస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…